తల్లిని కాస్తా పెళ్లాన్ని చేసుకున్నాడుగా.. ఇదేం ఘోరం !
ఈ కాలంలో మానవ బంధాలకు విలువ లేకుండా పోయిందనడానికి ఇలాంటి సంఘటనలే నిదర్శనం. వావి వరసలు మరిచి కొందరు నీచంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో కాబోయే అల్లుడితో లేచిపోయిన అత్త వార్త విన్నాం. తాజాగా అంతకుమించిన ఘటన హరియాణాలోని నుహ్ జిల్లాలో జరిగింది. 17 ఏళ్ల బాలుడ్ని తీసుకుని పారిపోయింది. అంతటితో ఆగకుండా ఆ బాలుడ్ని వివాహం చేసుకుంది. ఈ ఘటన పై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హరియాణాలోని నుహ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. 17 ఏళ్ల బాలుడు 40 ఏళ్ల సవతి తల్లి మోనికతో ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. ఈ ఘటనపై బాలుడి తండ్రి రామ్ కిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ వార్త ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

బాధితుడు రామ్ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. రామ్ కిషన్ మొదటి భార్య చనిపోయింది. అయితే గురుగ్రామ్ లోని సోహ్నా ప్రాంతానికి చెందిన మోనిక అనే మహిళను పెళ్లిచేసుకున్నాడు. 15 ఏళ్లుగా ఇద్దరూ కలిసే ఉంటున్నారు. అయితే గత కొద్ది కాలంగా రామ్ కిషన్ మొదటి భార్య కుమారుడు వీరితో కలిసి ఆ ఇంట్లో ఉంటున్నాడు. రామ్ కిషన్ ముందు మోనిక ను తల్లి అని పిలిచేవాడని.. కాళ్లు కూడా పట్టుకునే వాడని... కానీ వాళ్లిద్దరి మధ్య సీక్రెట్ ఎఫైర్ నడుస్తోందని తాను గ్రహించలేదని రామ్ కిషన్ పేర్కొన్నాడు.
Haryana: 40-year-old stepmother elopes with 17-year-old minor stepson in Nuh pic.twitter.com/hJ17QeaBLa
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 10, 2025
తాజాగా మోనికతో బాలుడు పారిపోయాడు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే వారి పెళ్లి చెల్లదని బాలుడికి 17 ఏళ్లేనని తండ్రి రామ్ కిషన్ తెలిపాడు. అయితే పోలీసులు మాత్రం వీళ్లిద్దరూ కోర్టు మ్యారేజ్ చేసుకున్నారని.. తాము ఏమీ చేయలేమని చెప్పడం గమనార్హం. దీంతో రామ్ కిషన్ విలపిస్తున్నాడు. ఇంట్లో ఉన్న రూ. 30,000 నగదు, బంగారం, వెండితో ఇద్దరూ పారిపోయారని తెలిపాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు.












Click it and Unblock the Notifications