కాలేజీ బాత్రూమ్ లో బిడ్డను కని.. చెత్తకుండీలో పడేసి..
కాలేజీ బాత్రూమ్ లోనే బిడ్డను ప్రసవించింది ఓ స్టూడెంట్. యూట్యూబ్ లో చూసి బొడ్డు పేగు కట్ చేసింది. ఆ తర్వాత ఆ పసిబిడ్డను చెత్తకుండీలో పడేసింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని కుంభకోణంలో జరిగింది. ప్రస్తుతం ఆ విద్యార్థిని, శిశువు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ అమానవీయ ఘటన ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగింది..?
తమిళనాడు తంజావూరు జిల్లా కుంభకోణంలోని ఓ మహిళా డిగ్రీ కాలేజీలో చదువుతున్న ఓ 20ఏళ్ల విద్యార్థిని జనవరి 30వ తేదీన క్లాసులోనే ఆకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను అంబులెన్స్ ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించింది కాలేజీ యాజమాన్యం. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు. విద్యార్థిని తీవ్రంగా రక్తస్రావం జరుగుతోందని.. ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పారు. బిడ్డ ఎక్కడ ఉంది అని టీచర్లను ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన కాలేజీ యాజమాన్యం.. బిడ్డకోసం కాలేజీ మొత్తం వెతకడం ప్రారంభించింది. ఈ క్రమంలో పోలీసులకూ సమాచారం ఇచ్చారు.

యూట్యూబ్ లో వీడియోలు చూసి..
అయితే కాలేజీలోని ఓ చెత్తకుండీలో బిడ్డను గుర్తించారు తోటి విద్యార్థులు.ఆ విద్యార్థిని కాలేజీ బాత్రూమ్ లోనే బిడ్డను కని.. యూట్యూబ్ వీడియో చూసి బొడ్డుపేగు కత్తిరించింది. ఆ తర్వాత బిడ్డను చెత్తకుండీలో వేసి.. చెత్తతో కప్పేసి తిరిగి క్లాసులోకి వచ్చి స్పృహ తప్పి పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు.
అయితే ప్రస్తుతం ఆ విద్యార్థిని, శిశువు క్షేమంగానే ఉన్నట్లు.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. విద్యార్థిని ఏమైనా లఫ్ ఎఫైర్ ఉందా..? ఆమెపై ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications