ఇదేం ట్విస్ట్ రా నాయనా.. ఒకేరోజు ఇద్దరితో పెళ్లి.. ఉదయం గర్ల్ ఫ్రెండ్.. సాయంత్రం..
ఆ యువకుడు ఒకేరోజు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. గంటల వ్యవధిలోనే రెండు సార్లు పెళ్లి కొడుకులా మారి వివాహమాడాడు. ఆ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ తో కోర్టు ఆవరణలో ఉదయం వివాహం చేసుకున్నాడు. సాయంత్రం ఇంటికెళ్లి పెద్దలు చూసిన అమ్మాయి మెడలో తాళి కట్టాడు. ఇలా ఒకే రోజు ఒకరికి తెలువకుండా మరొకరిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు చెందిన యువకుడు. ఈ ఘటనకు సంబంధించిన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఆ యువకుడి గర్ల్ ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
నాలుగేళ్లుగా లవ్..
హర్ పూర్ బుధత్ ప్రాంతానికి చెందిన ఓ యువతి స్థానికంగా ఉండే ఓ యువకుడిని ప్రేమించింది. అలా నాలుగేళ్లు ఇరువురూ ప్రేమించుకున్నాక ఓ రోజు గుడిలో పెళ్లిచేసుకున్నారు. ఇద్దరూ ఒకే దగ్గర ఉంటూ జీవనం సాగించారు. వివాహం చేసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఈ క్రమంలో ఆ యువకుడికి పెళ్లి ఫిక్స్ చేశారు కుటుంబ సభ్యులు. ఈ విషయాన్ని తన గర్ల్ ఫ్రెండ్ కు చెప్తాడు. ఆమె.. మనిద్దరం కోర్టు మ్యారేజ్ చేసుకొందామని..అప్పుడు మన పెళ్లి చట్టపరంగా చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత పేరెంట్స్ ను ఒప్పిద్దామని ప్లాన్ వేశారు.

కోర్ట్ మ్యారేజ్..
మరోవైపు వీళ్లు కోర్టు మ్యారేజ్ చేసుకుందామనుకున్న రోజే ఆ యువకుడికి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. దీంతో ఉదయం కోర్టు ప్రారంభం కాగానే అక్కడే వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెతో తాను తన పేరెంట్స్ ను ఒప్పిస్తానని చెప్పి అక్కడి నుంచి ఆ యువకుడు వెళ్లిపోయాడు. సాయంత్రం పెద్దలు కుదిర్చిన వివాహానికి హాజరై అక్కడ వేరే యువతికి తాళి కట్టాడు. అయితే కొన్ని రోజుల వరకు ఈ విషయం ఆ యువకుడి గర్ల్ ఫ్రెండ్ కు తెలియదు.
కానీ ఓ రోజు అనుమానం వచ్చి యువకుడి ఇంటికి వచ్చి నిలదీసింది. దీంతో ఆమెను యువకుడి కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనను కోర్టులో పెళ్లి చేసుకుని.. మళ్లీ అదే రోజు వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడని ఆ యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications