షాకింగ్ లవ్ స్టోరీ: తాళి కట్టే సమయంలో అన్నను పక్కకు తోసేసి.. తమ్ముడు ఏం చేశాడంటే..

తాళి కట్టే సమయంలో అన్నను పక్కకు తోసేసి పెళ్లి కుమార్తెకు తమ్ముడు తాళి కట్టిన ఉదంతమిది. పెళ్లికొచ్చిన బంధువులంతా అవాక్కయిన ఈ వింత ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

చెన్నై: తాళి కట్టే సమయంలో అన్నను పక్కకు తోసేసి పెళ్లి కుమార్తెకు తమ్ముడు తాళి కట్టిన ఉదంతమిది. పెళ్లికొచ్చిన బంధువులంతా అవాక్కయిన ఈ వింత ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...

వేలూరు జిల్లా తిరుపత్తూరు తాలుకా సెల్లరపట్టి గ్రామానికి చెందిన కామరాజ్‌ కు కుమారులు రంజిత్, రాజేష్, వినోద్‌ ఉన్నారు. వీరిలో రాజేష్, వినోద్‌ తిరుప్పూరులోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు.

marriage

ఆరు నెలల క్రితం రాజేష్‌కు మధురైకి చెందిన ఒక యువతితో పెళ్లి సంబంధం కుదిరింది.
ఈ మేరకు గురువారం ఉదయం తిరుపత్తూరు సమీపంలోని వేలన్‌గుండ్రం మురుగన్‌ ఆలయంలో వివాహ ఏర్పాట్లు చేశారు.

సంప్రదాయం ప్రకారం వరుడు రాజేష్‌కు బుధవారం రాత్రి ఇంటిలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. పెళ్లి కుమార్తె రాత్రి మురుగన్‌ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పెళ్లి కుమారుడికి అలంకరణలు చేసి పెళ్లి పీటలపైకి తీసుకొచ్చారు.

వేద మంత్రాల నడుమ తాళిబొట్టును కూడా పెద్దలంతా తాకి ఆశీర్వదించారు. అనంతరం వరుడు రాజేష్ తనకు కాబోయే భార్యకు తాళిబొట్టు కట్టబోతుండగా హఠాత్తుగా జరిగిందా సంఘటన.

అప్పటి వరకు పెళ్లిమంటపంలో రాజేష్ పక్కనే ఉన్న అతని తమ్ముడు వినోద్‌ అకస్మాత్తుగా అన్నను పక్కకు తోసేశాడు. ఏం జరుగుతోందో గ్రహించే లోపే తన వెంట తెచ్చుకున్న మరో తాళిబొట్టుని పెళ్లి కుమార్తె మెడలో కట్టేశాడు. దీంతో అక్కడున్నవారంతా అవాక్యయ్యారు.

జరిగింది తెలియగానే వధువు బంధువులు వినోద్‌పై దాడిచేసి పిడిగుద్దులు కురిపించారు. అనంతరం బంధువులంతా కలసి పంచాయితీ చేయగా.. అసలు విషయం అప్పుడు బయటపడింది.

అసలు పెళ్లి చూపుల సమయంలోనే వినోద్‌కు, ఆ యువతికి చూపులు కలిసి ప్రేమ పుట్టిందట. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు తెలిసింది. దీంతో పెళ్లి పీటలపై ఉన్న పెళ్లి కుమార్తెను కూడా కుటుంబీకులు చితక బాదారు.

ఇదంతా గమనించిన పెళ్లికొడుకు రాజేష్ అవమాన భారంతో పెళ్ళి దుస్తులను చించి వేచి రోదిస్తూ అక్కడి నుంచి వెళ్లి పోవడంతో తమ్ముడి ప్రేమ ఫలించినట్లయింది. తాను తాళికట్టిన తన ప్రియురాలితో వినోద్ మధురై వెళ్లిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+