వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఆయా కాదు సైతాన్, పాపను దంచేసింది (వీడియో)

ముంబైలోని పూర్వ ప్లే స్కూల్ లో కేర్ టేకర్ గా పని చేస్తున్న అఫ్సానా షేక్ అనే మహిళ 10 నెలల పాపను కాలితో తన్ని నేల మీద విసిరివేసి చితకబాదింది.

|
Google Oneindia TeluguNews

ముంబై: 10 నెలల పసిపాపను కంటికి రెప్పలా చూసుకోవలసిన కేర్ టేకర్ అత్యంత రాక్షసంగా ప్రవర్తించి చిన్నారిని గొడ్డును బాదినట్లు బాదిన ఘటన నవి ముంబైలో జరిగింది. అత్యంత దారుణంగా కొట్టడంతో ఆ పసిబిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని పోలీసులు చెప్పారు.

నవి ముంబై నగరంలో దంపతులు నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ దంపతులకు 10 నెలల పాప ఉంది. ఇంటి సమీపంలోని పూర్వ ప్లే స్కూల్ లో తమ బిడ్డను చేర్పించారు.

తల్లి లేని సమయంలో తల్లికంటే ఎక్కువగా చూసుకుంటామని కేర్ టేకర్ నిర్వహకులు అప్పట్లో దంపతులకు మాట ఇచ్చారు. ఇదే ప్లే స్కూల్ లో కేర్ టేకర్ గా అఫ్సానా షేక్ అనే మహిళ పని చేస్తుంది.

10 నెలల పాప ఏడుస్తుంటే అఫ్సానా షేక్ బిడ్డను లాగిలాగి కొట్టి నేల మీద విసిరివేసింది. నొప్పి తట్టుకోలేక ఏడుస్తున్న పాపను కాలితో తన్ని పేపర్లు విసిరేసి నానా హంగామా చేసింది. పసిబిడ్డ అనే కనికరం లేకుండా చావకొట్టింది. తరువాత వచ్చిన కుటుంబ సభ్యులు పాపను తీసుకుని ఇంటికి వెళ్లారు.

పాప శరీరం మీద పెద్దపెద్ద గాయాలు ఉండటంతో ప్లే స్కూల్ నిర్వహకులను నిలదీశారు. ఈనెల 21వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పూర్వ ప్లే స్కూల్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి అఫ్సానా షేక్ ను అరెస్టు చేశారు.

కేర్ టేకర్ అఫ్సానా షేక్ ను 14 రోజులు రిమాండ్ కు తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్లే స్కూల్ యజమాని ప్రియా నికమ్ మీద కేసు నమోదు చేశారు. ప్లే స్కూల్ లో తమ బిడ్డలు క్షేమంగా ఉంటారని అనుకుంటున్న తల్లిదండ్రులకు ఇలాంటి వీడియో చూసి ఆందోళన చెందుతున్నారు.

English summary
The play school was inaugurated five months ago and Sheikh was employed only a month back. When the incident took place around afternoon on November 21.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X