కన్నతండ్రే కామాంధుడు: వీడియో తీసిన కూతురు

ఓరాయ్: భారత్‌లోని మహిళలు, ఆడపిల్లలకు భద్రత లేదని ఈ సంఘటన చూస్తుంటే తెలుస్తోంది. కన్న తండ్రే బంధాలు, అనుబంధాలను మరిచి తన కుమార్తెను లైంగిక వేధింపుకు గురి చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలోని ఓరయ్ పట్టణంలో చోటు చేసుకుంది.

గత నాలుగేళ్లగా కుమార్తెకు కన్న తండ్రే కామాంధుడిగా మారి నరకం చూపించాడు. అయితే ఈ విషయాన్ని తల్లి, అక్కకు చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో సరాసరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కన్న తండ్రే తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది.

Shocking! Raped by father for 4 years, girl gets own rape video clip made

అయితే అందుకు పోలీసులు కేసు నమోదు చేయాలంటే సాక్ష్యం చూపించాలంటూ తిరిగి వెనక్కి పంపించేశారు. దీంతో 15 ఏళ్ల వయసున్న ఆ బాలిక తన స్నేహితురాలి సాయంతో తండ్రికి తగిన బుద్ధి చెప్పింది. ఇందు కోసం స్నేహితురాలి సాయం తీసుకుంది.

తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సమయంలో వీడియో తీయాలని స్నేహితురాలికి చెప్పింది. దీంతో ముందుగానే ఓపెన్ చేసిన కిటీలో నుంచి స్నేహితురాలు రేప్ సన్నివేశం మొత్తాన్ని మొబైల్‌లో వీడియో తీసింది. ఆ వీడియోను సాక్ష్యంగా చూపించి ఆ కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రిని కటకటాల పాలు చేసింది.

వీడియో తీయక ముందు తండ్రి తనపై చేస్తున్న లైగింక వేధింపులను తల్లికి చెప్పినా నమ్మలేదు. ఆ వీడియోను చూసిన తర్వాత ఆమె తల్లి నివ్వెరపోయింది. కూతురితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తండ్రిపై ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, 506పై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+