మీరెక్కడ తయారయ్యార్రా బాబూ..!

ప్రభుత్వ సంస్థల్లో పరిస్థితి ఎలా ఉందో ఈ సంఘటనలు చాలు. ముఖ్యంగా పోలీసు డిపార్ట్ మెంట్ లోని లుకలుకలు ఈ ఘటన ద్వారా బయటపడ్డాయి. మధ్య ప్రదేశ్ లో జరిగిన ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లో ఓ పోలీసు అధికారి 12 ఏళ్లుగా ఉద్యోగం చేయకుండా రూ. 28 లక్షలు జీతం తీసుకున్న సంఘటన ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Shocking Scandal Madhya Pradesh Cop Draws 28 Lakh Without Duty for 12 Years

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 సంవత్సరాలు డ్యూటీ చేయకుండా జీతం తీసుకున్నాడు ఓ పోలీసు అధికారి. ఒక్కరోజు కూడా డ్యూటీ చేయకుండా రూ.28 లక్షల జీతం తీసుకున్నాడు విదిశ జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 2011లో నియామకం పొందిన సాగర్‌ అనే వ్యక్తి ట్రైనింగ్ పూర్తయిన అనంతరం విధుల్లో చేరలేదు. అయినప్పటికీ, అతని జీతం క్రమం తప్పకుండా చెల్లించారు. బదిలీల సమయంలో ఈ వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం అతని నుండి రూ. 1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

ఈ ఘటనపై ఆ పోలీస్ ను ఉన్నాతాధికారులు విచారణకు పిలిచారు. పలు ప్రశ్నలు సంధించారు. అయితే తాను మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, అందువల్ల విధులకు హాజరు కాలేదన్నాడు. కొన్ని రిపోర్టులను కూడా అధికారులకు చూపించాడు. ఇక ప్రస్తుతం ఆ పోలీస్ ను భోపాల్ పోలీస్ లైన్‌ లో ఉంచారు. అతని నుండి రూ. 1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రభుత్వ పాఠశాల గోడకు 4 లీటర్ల పెయింట్‌ వేసేందుకు 168 కార్మికులు, 65 మంది తాపీ మేస్త్రీలను పెట్టారు. ఈ విషయం ఇటీవల సంచలనంగా మారింది. ఈ పనికి సంబంధించిన బిల్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+