షాకింగ్ : 20 కోట్లకు పైగా పన్ను ఎగవేసిన సోను సూద్.. ఛారిటీ ఖాతాలో 18 కోట్లకు పైగా; ఐటీ తనిఖీల్లో కీలక పత్రాలు

ప్రముఖ బాలీవుడ్ నటుడు, అడిగిన వారికి లేదనకుండా ఆపన్నహస్తం అందించిన సోనూసూద్ కు సంబంధించి మూడు రోజుల పాటు జరిగిన ఆదాయపు పన్ను శాఖ తనిఖీలలో 20 కోట్ల రూపాయలకు పైగా పన్నులు ఎగవేసినట్లు, ఆదాయపు పన్ను శాఖ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించింది. మూడు రోజులపాటు సోనూసూద్ కు సంబంధించిన ఆస్తులపై జరిపిన తనిఖీలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల సోను సూద్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అవడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడన్న చర్చ జరిగింది. ఈ క్రమంలోనే చోటుచేసుకున్న తాజా పరిణామాలలో భాగంగా జరిపిన ఐటీ తనిఖీల ద్వారా ఆయన 20 కోట్ల రూపాయలకు పైగా పన్ను ఎగవేశారని నిర్ధారించారు.

 సోను సూద్ పై ఐటీ తనిఖీలు .. దేశ వ్యాప్త చర్చ .. సోనుకు మద్దతుగా అభిమానులు

సోను సూద్ పై ఐటీ తనిఖీలు .. దేశ వ్యాప్త చర్చ .. సోనుకు మద్దతుగా అభిమానులు

సోను సూద్ పై ఐటీ శాఖ తనిఖీలతో దేశ వ్యాప్త ఆసక్తి నెలకొంది. ఆయన అభిమానుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఆయన చేసిన తప్పేంటి అన్న ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. మంచివారినే ప్రభుత్వాలు టార్గెట్ చేస్తాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. సోను సూద్ ను 'నిజమైన హీరో' అని పేర్కొంటూ పలువురు ట్విట్టర్‌ వేదికగా అభిమానుల యుద్ధం కొనసాగుతుంది. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న, సామాజిక కార్యక్రమాల ద్వారా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకున్న పేదల పెన్నిధి సోనూసూద్ అని గుర్తు చేస్తున్నారు. ఐటీ అధికారుల సర్వే ఆపరేషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కరోనా మహమ్మారి తో భారత దేశం తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఆయన చేసిన సేవలు గణనీయమైనవని పేర్కొన్నారు. నిరుపేదలకు అండగా సహాయ కార్యక్రమాలు నిర్వహించిన సోను సూద్ ఎంతోమంది నిరుపేదలకు దేవుడయ్యాడని గుర్తు చేస్తూ అభిమానులు ట్విట్టర్‌లో సోనూ సూద్ కు తమ మద్దతును తెలిపారు.

ఫారిన్ కాంట్రిబ్యూషన్ చట్ట ఉల్లంఘన చేసి విదేశీ దాతల నుండి 2.1 కోట్ల రూపాయల సేకరణ

ఫారిన్ కాంట్రిబ్యూషన్ చట్ట ఉల్లంఘన చేసి విదేశీ దాతల నుండి 2.1 కోట్ల రూపాయల సేకరణ

మొదట సోను సూద్ మీద జరుగుతున్నవి సాధారణ ప్రక్రియలో భాగంగా జరుగుతున్న సర్వేలు అని చెప్పిన ఐటీ అధికారులు ఖాతాల నిర్వహణలో అవకతవకలను గుర్తించి మరింత లోతుగా సోదాలు చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల వద్ద విశేషమైన అభిమానాన్ని చూరగొన్న సోను సూద్ విదేశీ దాతల నుండి ఫారిన్ కంట్రిబ్యూషన్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ 2.1 కోట్ల నగదును సేకరించారని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమ తనిఖీలలో గుర్తించినట్టు వెల్లడించారు . లాభాపేక్షలేని లావాదేవీలను నియంత్రించే చట్టం - ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి విదేశీ దాతల నుండి ₹ 2.1 కోట్లను సేకరించినట్లు ఆదాయపు పన్నుపన్ను శాఖ తెలిపింది.

సోను సూద్ కు సంబంధించిన 28 చోట్ల తనిఖీలు.. కీలక ఆధారాలు

సోను సూద్ కు సంబంధించిన 28 చోట్ల తనిఖీలు.. కీలక ఆధారాలు

సోనూసూద్ పై నిర్వహించిన సర్వే ఆపరేషన్ సమయంలో ముంబై, లక్నో, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ, గురుగ్రామ్‌లోని 28 ప్రాంగణాలను శోధించినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. సోను సూద్ ఆదాయపు పన్ను తప్పించుకోవడం కోసం తన ఆదాయాన్ని బోగస్ రుణాల రూపంలో చూపించారని, బోగస్ ఎంటిటీలు చేశారని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. సోను సూద్ తో పాటుగా అతని తో కలిసి కీలకంగా పని చేస్తున్న కొంతమందికి సంబంధించిన ఆస్తుల పై తనిఖీలు చేసిన అధికారులు పన్ను ఎగవేతకు సంబంధించిన నేరపూరిత సాక్ష్యాలు కనుగొనబడ్డాయని పేర్కొన్నారు.

 ఆదాయపు పన్ను ఎగవేతకు సంబంధించి 20 నేరపూరిత ఎంట్రీలు

ఆదాయపు పన్ను ఎగవేతకు సంబంధించి 20 నేరపూరిత ఎంట్రీలు


ఇప్పటివరకు జరిగిన పరిశోధనలలో 20 అటువంటి ఎంట్రీలను ఉపయోగించినట్లు వెల్లడైంది, వీటిలో ప్రొవైడర్లు, బోగస్ వసతి ఎంట్రీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. నగదుకు బదులుగా చెక్కులు జారీ చేసినట్లు వారు అంగీకరించారు. ప్రొఫెషనల్ రసీదులు ఉన్న సందర్భాలు ఉన్నాయి. పన్ను ఎగవేత కోసం ఖాతాల పుస్తకాలలో పన్ను తగ్గించుకునేందుకు రుణాలు ఉన్నట్టు చూపించబడ్డాయి అని పేర్కొన్నారు. ఈ బోగస్ రుణాలు పెట్టుబడులు పెట్టడానికి మరియు ఆస్తులను సంపాదించడానికి ఉపయోగించబడ్డాయని కూడా వెల్లడైంది. ఇప్పటివరకు వెలికితీసిన మొత్తం పన్ను మొత్తం, రూ. 20 కోట్ల కంటే ఎక్కువ "అని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

సోను సూద్ చారిటీ ఖాతాలో 18 కోట్లకు పైగా విరాళాలు .. అందులో ఖర్చు చేసింది మాత్రం ..

సోను సూద్ చారిటీ ఖాతాలో 18 కోట్లకు పైగా విరాళాలు .. అందులో ఖర్చు చేసింది మాత్రం ..

కోవిడ్ -19 మహమ్మారి బారిన పడిన వారి కోసం చేసిన సేవలకు, వలస కార్మికులకు అందించిన సహాయానికి దేశవ్యాప్తంగా నిరుపేదల దేవుడిగా సోనూసూద్ కు అత్యంత గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో గత సంవత్సరం జూలైలో స్థాపించబడిన అతని స్వచ్ఛంద సేవ సూద్ ఛారిటీ ఫౌండేషన్ రూ. 18 కోట్లకు పైగా విరాళాలు సేకరించింది. ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు, అందులో రూ. 1.9 కోట్లు సహాయ పనులకు ఖర్చు చేయబడ్డాయి . మిగిలినవి ₹ 17 కోట్లు సూద్ ఫౌండేషన్ కి సంబంధించి బ్యాంకు ఖాతాలోనే ఉన్నట్లుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు.

 సోను సూద్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్

సోను సూద్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్

సోను సూద్ ఎప్పుడైతే ప్రజల్లో సేవల ద్వారా హీరోగా మారారో అప్పటి నుండి ఆయనపై దేశానికి ప్రత్యేక ఆసక్తి నెలకొంది. సూద్ ఆదాయం, ఆస్తులు విషయానికి వస్తే కేవలం 5500 రూపాయలతో ముంబై వచ్చిన సోను సూద్ నేడు దాదాపు 130 కోట్ల విలువైన ఆస్తులు సంపాదించారని చర్చ జరుగుతోంది. సోను సూద్ ఆస్తులపై ఒక మీడియా సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం సోనూసూద్ నికర ఆస్తుల విలువ సెప్టెంబర్ 2021 నాటికి 130 కోట్లు . సోను సూద్ ప్రస్తుతం భార్య, పిల్లలతో ముంబైలో నివసిస్తున్నాడు. ఆయన హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు పంజాబీ చిత్రాలలో నటిస్తున్నారు.

 ఆదాయపు పన్ను తప్పించుకునేందుకు అవకతవకలకు పాల్పడ్డారన్న ఐటీ అధికారులు

ఆదాయపు పన్ను తప్పించుకునేందుకు అవకతవకలకు పాల్పడ్డారన్న ఐటీ అధికారులు

సోను సూద్ పని చేసే ఒక్కో చిత్రానికి రెండు కోట్ల పారితోషకం తీసుకుంటారని సమాచారం . అంతేకాదు ఆయన బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా గణనీయమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. సోను సూద్ శక్తి సాగర్ ప్రొడక్షన్స్ అనే సొంత నిర్మాణ సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. ఆయన ఆదాయం సంవత్సరంలో మొత్తం 12 కోట్లు ఉంటుందని సమాచారం . ఆయన ఆడాయంలోనే పన్నులు చెల్లించకుండా సోను సూద్ ఎక్కువగా అవకతవకలకు పాల్పడ్డారని ఐటీ అధికారులు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+