షాకింగ్: లైంగికంగా వేధించారన్న సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్‌ఫ్రెండ్
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో గతంలో డేటింగ్ చేసిన అతని మాజీ ప్రియురాలు సోమీ అలీ ఓ షాకింగ్ విషయం చెప్పారు.! తనకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యానని ఆమె చెప్పారు. సోమీ అలీ గతంలో బాలీవుడ్ నటి కూడా.
ఆమె ప్రస్తుతం నో మోర్ టియర్స్ (ఎన్ఎంటీ) అనే ఎన్జీవోను నడిపిస్తున్నారు. ఈ సంస్థను స్థాపించి మార్చి 27వ తేదీ నాటికి ఎనిమిదేళ్లు పూర్తయింది. వేధింపులకు గురైన మహిళల కోసం దీనిని స్థాపించారు.

ప్రస్తుతం ఎన్జీవోను నడిపిస్తున్న ఆమె మాట్లాడుతూ.. తాను ఈ సంస్థను ఎందుకు నడిపిస్తున్నాననే విషయం చెప్పారు. తాను పాకిస్తాన్‌లో పెరిగానని, నిత్యం గృహహింసను చూస్తూ పెరిగానని చెప్పారు. తన తల్లి యొక్క చాలామంది స్నేహితులు భౌతికంగా బాధలకు గురైనవారేనని చెప్పారు.
తన తల్లి స్నేహితుల శరీరాల పైన దెబ్బలు ఉండేవని చెప్పారు. వీటి గురించి తాను తన తల్లిని అడిగితే... ఆ ఆంటీ మెట్ల మీద నుండి పడటం వల్ల గాయాలయ్యాయని సమాధానం వచ్చేదని చెప్పారు.

అదే సమయంలో తనకు ఎదురైన లైంగిక వేధింపు గురించి చెప్పారు. తనకు తన చిన్నతనంలోనే షాకింగ్ అనుభవం ఎదురయిందన్నారు. తనకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు హౌస్ హెల్ప్ తనను లైంగికంగా వేధించాడని చెప్పారు.
తన జీవితంలోని చీకటి కోణాన్ని పంచుకోవడానికి తాను ఎప్పుడు సంకోచించనని చెప్పారు. తన అనుభవాలు పంచుకోవడం ద్వారా ఇతరులను చైతన్యవంతులను చేసేందుకు ఉపకరిస్తుందన్నారు. తాను బాధితురాలిని అయినందుకు ఏమీ సిగ్గుపడటం లేదన్నారు.
-
సొంత భర్త సినిమాకు దీపిక ఆబ్సెంట్.. ఏం జరుగుతోంది..? -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
"ధురంధర్ 2 సినిమాను బ్యాన్ చేయాలి" -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
నటి డ్రెస్ జిప్ తీసేసిన హీరో: డైరెక్టర్ కట్ చెప్పినా ఆగని రొమాన్స్! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications