ప్రొడక్షన్ హౌజ్ పేరుతో సెక్స్ రాకెట్: మోడల్ అరెస్ట్

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని వెర్సోరా ప్రాంతంలో ప్రొడక్షన్ హౌజ్ పేరుతో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న 24ఏళ్ల ఓ మోడల్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు పోలీసులు. మోడలింగ్‌తో పాటు సినీ వినీలాకాశంలో మెరిసిపోదామంటూ వచ్చి నానా ఇబ్బందులు పడుతున్న అమాయక యువతుల బలహీనతలనే లక్ష్యంగా చేసుకున్న ఆ మోడల్... వారితో వ్యభిచారం నిర్వహిస్తోందని పోలీసులు తెలిపారు.

ఇందుకోసం ఆ లేడీ మోడల్ ఏకంగా ప్రొడక్షన్ హౌస్‌ను కూడా తెరచిందని చెప్పారు. ప్రొడక్షన్ హౌస్ పేరిట ఆ మోడల్ నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌పై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఆమె కార్యాలయంపై మెరుపు దాడులు చేశారు.

 SHOCKING! This model ran sex racket under guise of production house in Mumbai's Versova, arrested

ఈ దాడుల్లో భాగంగా ఇద్దరు మైనర్ బాలికలను వారు వ్యభిచార కూపం నుంచి రక్షించారు. ఆ తర్వాత మోడల్‌ను అరెస్ట్ చేశారు. సినీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అమాయక యువతులే లక్ష్యంగా సదరు మోడల్ ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.

సినీ అవకాశాల కోసం వచ్చిన వారికి ఏవో మాయమాటలు చెప్పి వ్యభిచారం కూపంలోకి నెట్టుతోందని పోలీసులు తెలిపారు. అంతేగాక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పలువురు మోడళ్లతో కూడా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. మోడల్ వద్ద ఓ డైరీని స్వాధీనం చేసుకున్నామని, అందులో పలువురు మోడళ్ల నెంబర్లు ఉన్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+