వాహ్.. ఏం ఐడియా 'గురు'.. ఈ ఆటో డ్రైవర్ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే..!
టాలెంట్ ఎవరి సొత్తు కాదు అనేది నిజం. అందుకు కులం, మతం, ప్రాంతం, భాష, వర్ణం, రూపు ఏది అడ్డంకి కాదు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎందరో నిరూపించి చూపించారు. నేటి కాలంలో కూడా నిరూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఎప్పటి లాగే ఆరోజు కూడా ఆఫీసుకి వెళ్లడానికి ఆటో బుక్ చేసుకున్న ఒక మహిళకి ఒక ఆటో డ్రైవర్ భాషా రేంజ్ ట్విస్ట్ ఇచ్చాడు.
ఎక్కిన వెంటనే ఆటో డ్రైవర్ సీటు వెనుక అంటించి ఉన్న ఒక పేపర్ ని చదవడం ప్రారంభించింది. ఆ పేపర్ లో.. తానొక టేబుల్ టెన్నిస్ కోచ్ అని.. అందులో కోచింగ్ కావాలనుకునే వాళ్లకి తన నంబర్ ఇవ్వమని రాసి ఉంది. అది చదివాక అర్దం అయ్యింది. అతను ఒక మామూలు ఆటో డ్రైవర్ కాదు.. టేబుల్ టెన్నిస్ కోచ్ అని తెలిసి ఒకింత ఆశ్చర్యపోయింది. దాంతో అతన్ని అసలు ఏం జరిగింది.. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగి తెలుసుకుంది.

ఆమె అడిగిన తర్వాత తన కష్టాలను నెమరువేసుకున్న ఆ వ్యక్తి.. తన గతం గురించి ఓపెన్ అయ్యాడు. స్టేట్ టీమ్ కోసం ఎంతో మంది టేబుల్ టెన్నిస్ క్రీడాకారులకు తీర్చిదిద్దిన కోచ్ గా ఉన్న ఆ వ్యక్తి.. ఇప్పుడు ఆటో డ్రైవర్ గా ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పేశాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆ ఆటో డ్రైవర్ ఇన్స్పిరేషనల్ స్టోరీని పంచుకుంది. టేబుల్ టెన్నిస్ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్న వారు ఆటో డ్రైవర్ గురుమూర్తి ని కలవండి అంటూ అతని నంబర్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే కాకుండా ఆటోలో వెళ్తున్న సమయంలో కూడా అతను మాట్లాడే విధానం, ప్రొఫెషనల్ గా ఉందని కితాబిచ్చింది. ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంతకీ ఆ ఆటో డ్రైవర్ స్టోరీ ఏంటి అంటే.. బెంగళూరు లోని మల్లేశ్వరంకి చెందిన సదరు ఆటో డ్రైవర్ ఒకప్పుడు కర్ణాటక స్టేట్ టీమ్ కి ఫుల్ టైం కోచ్ లా పని చేశాడట. అయితే 2020లో కరోనా లాక్ డౌన్ కారణంగా కోచింగ్ కెరీర్ అర్థాంతరంగా ఆగిపోయిందని.. జీవనోపాధి కోసం ఆటో నడపడం మొదలు పెట్టినట్టు తెలిపాడు. గురుమూర్తిస్టోరీ చదివిన వారంతా ఎంతో మందికి ఆయన స్పూర్తిగా నిలుస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications