మద్యం మత్తులో పైశాచికత్వం.. 20 సెకన్లలో 30 చెంపదెబ్బలు!(వీడియో)
ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్ జిల్లాలో ఒక దారుణమై ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో తన పొరుగున ఉన్న మహిళను అతి దారుణంగా చెంపదెబ్బలు కొడుతూ తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. వీధిలో గుమిగూడిన ప్రజలు ఈ దౌర్జన్యాన్ని చూస్తూ నిలబడిపోయారు కానీ ఎవరూ ఆమెకు సహాయం చేయకపోవడం గమనార్హం. ఈ లోగా మహిళ సోదరుడు అక్కడికి వచ్చి కొడుతున్న వ్యక్తిని గట్టిగా నెట్టేసి కింద పడేశాడు. పోలీసులు గాయపడిన ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ ఘటన హాపుర్ నగర్ కొత్వాలి పరిధిలోని ఆదర్శ్ నగర్‌లో జరిగింది. గురువారం మధ్యాహ్నం అక్కడ నివసించే ఒక యువకుడికి తన పొరుగున ఉన్న మహిళతో ఏదో విషయంలో గొడవ జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి వీధిలోనే మహిళను కొట్టడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి సుమారు 20 సెకన్లలో మహిళను ఒకదాని తర్వాత ఒకటిగా దాదాపు 30 చెంపదెబ్బలు కొట్టాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చుట్టుపక్కల ప్రజలు ఈ దౌర్జన్యాన్ని వీడియో తీస్తూ, గుమిగూడి మొత్తం తమాషా చూడటం ప్రారంభించారు. కానీ గుంపులో ఉన్న ఎవరూ కూడా ఆ మహిళను కాపాడటానికి ధైర్యం చేయలేకపోయారు.

ఆ గొడవ జరుగుతుండగానే ఆ మహిళ సోదరుడు ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఆ వ్యక్తి మళ్లీ మహిళను కొట్టడానికి చేయి ఎత్తగానే.. మహిళ సోదరుడు అతడిని పట్టుకుని బలంగా నేలపై పడగొట్టాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే కదలకుండా పడిపోయాడు. ఆ తర్వాత మహిళ కూడా తన చెప్పు తీసి ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. మహిళ సోదరుడు కొట్టిన దెబ్బకు మద్యం సేవించిన వ్యక్తి ముఖానికి గాయాలయ్యాయని.. దీంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చామని హాపుర్ సిటీ పోలీసు అధికారి జితేంద్ర శర్మ తెలిపారు. ఆ తర్వాత అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
महिला को युवक पीटता रहा लोग वीडियो बनाते रहे,
— TUSHAR DIVAKAR (@DivakarTushar) July 18, 2025
युवक नशे गाली गलोज कर रहा था
महिला ने विरोध किया था..#Up #Hapur@azizkavish @PragyaLive @itsbhoomi1 @JaikyYadav16 pic.twitter.com/puj6bJysV1












Click it and Unblock the Notifications