దారుణం.. పెళ్లైన 45 రోజులకే.. మామ కోసం భర్తను చంపేసింది!
Bihar: ఇటీవల కాలంలో వివాహ బంధానికి విలువ లేకుండా పోతోంది. చిన్న చిన్న కారణాలకే హత్యలు చేసే స్థాయికి సంబంధాలు దిగజారిపోయాయి. ఇటీవల పెళ్లి తర్వాత కాళ్ల పారాణి ఆరకముందే తమ భర్తలను హత్య చేస్తున్న ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. మేఘాలయ హనీమూన్ మర్డర్ తర్వాత ఇలాంటి దారుణాలు చాలా చోటుచేసుకుంది. తాజాగా బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పెళ్లి అయిన 45 రోజులకే ఓ నవవధువు.. తన ప్రియుడైన మేనమామతో కలిసి కట్టుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా హత్య చేయింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఔరంగాబాద్ జిల్లాలోని బర్వాన్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల ప్రియాన్షుకు 45 రోజుల క్రితం గుంజా దేవితో వివాహం జరిగింది. అయితే గుంజా దేవికి పెళ్లికి ముందు నుంచి తన మేనమామ అయిన జీవన్ సింగ్(55)తో ప్రేమ వ్యవహారం ఉంది. వీరిద్దరి వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకుండా గుంజాదేవిని ప్రియాన్షుకు ఇచ్చి బలవంతంగా పెళ్లి జరిపించారు. ఈ క్రమంలో ఆమె మేనమామ జీవన్ సింగ్‌తో కలిసి ఉండాలంటే.. తన భర్త ప్రియాన్షు అడ్డు తొలగించుకోవాలని గుంజా దేవి భావించింది.

తన భర్తతో కాపురం ఇష్టం లేని గుంజాదేవి.. తన మేనమామ జీవన్ సింగ్‌తో కలిసి కుట్ర పన్నింది. జూన్ 25న ప్రియాన్షు తన సోదరి ఇంటికి వెళ్లి రైలులో తిరిగి ఇంటికి వస్తున్నాడు. నవీ నగర్ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, తనను పికప్ చేసుకోవడానికి బైక్‌పై ఎవరినైనా పంపమని దేవికి చెప్పాడు. ఇదే అవకాశం అనుకున్న గుంజాదేవి.. అతడిని చంపించేందుకు ఓ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చింది. స్టేషన్ నుండి ఇంటికి వెళ్లే దారిలో, ఇద్దరు వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
పోలీసులు విచారణ ప్రారంభించి నిందితుల కోసం గాలిస్తుండగా.. గుంజా దేవి గ్రామం నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. ఇది ప్రియాన్షు కుటుంబ సభ్యులలో అనుమానాన్ని రేకెత్తించింది. గుంజా దేవి కాల్ రికార్డులను పరిశీలించగా.. ఆమె తన మేనమామతో నిరంతరం టచ్‌లో ఉందని పోలీసులు తెలుసుకున్నారు. మేనమామ జీవన్ సింగ్ కాల్ రికార్డుల వివరాలు అతను షూటర్లతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు చూపించాయి."ఈ హత్య కేసును విచారించడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయబడింది. ప్రియాన్షు, గుంజా దేవి వివాహం జరిగిన 45 రోజుల తర్వాత ఈ హత్య జరిగింది. గుంజా దేవి సహా ముగ్గురిని అరెస్టు చేశారు. జీవన్ సింగ్‌ను అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని ఎస్పీ వెల్లడించారు. .
మేఘాలయ హనీమూన్ కేసు మే నెలలో రాజా రఘువంశీని నవవధువు సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుషావ హనీమూన్ సమయంలో హత్య చేసిన సంగతి తెలిసిందే. సోనమ్ తన భర్తను చంపడానికి మరో ముగ్గురు వ్యక్తుల సహాయం కూడా తీసుకుంది. నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications