అది మణిపూర్ సంస్కృతి: రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చిన సీఎం బీరేన్ సింగ్, కిరణ్ రిజిజు సెటైర్

ఇంఫాల్: చెప్పులు విడిచి ఇంట్లోకి వెళ్లడం తమ సంస్కృతి అని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మణిపూర్ సీఎం బీరేన్ సింగ్. ఎందుకంటే.. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఆ రాష్ట్రానికి పలువురు బీజేపీ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, ఆ సమయంలో ఇంట్లోకి వెళ్లేముందు వారితో బయటే బలవంతంగా చెప్పులు విప్పించి వారిని అవమానించారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.

అంతేగాక, వారికి అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు రాహుల్. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు. చెప్పులు విప్పి ఇంట్లోకి వెళ్లడం మణిపూర్ ప్రజల సంస్కృతి అని చెప్పారు.

 shoe remark: Manipur CM N Biren Singh and Union minister Kiren Rijiju lashes out at Rahul Gandhi

ఒకరి ఇంటికి వెళ్లినప్పుడు గుమ్మంలో చెప్పులు విప్పి లోపలికి వెళ్లడం మణిపూర్‌లో ఏళ్లుగా ఉన్న సంస్కృతి అని, కొందరు పనిగట్టుకుని దాన్ని అవమానం పేరుతో ప్రచారం చేస్తున్నారని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్.. రాహుల్ గాంధీపై మండిపడ్డారు. రాహుల్.. తమ సంప్రదాయాల్ని పట్తించుకోవట్లేదన్నారు ముఖ్యమంత్రి బీరేన్. ముందు మణిపూర్ సంస్కృతి గురించి తెలుసుకుని మాట్లాడాలని రాహుల్ గాంధీకి హితవు పలికారు.

ఇది ఇలా ఉంటే, దేశం రెండు భారతదేశాలుగా విడిపోయిందని, ఒకటి ధనవంతుల దేశంగా.. మరోటి పేదల దేశం మారిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మరో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. నిజమే.. ఒక దేశంలో ప్రజలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. రేవ్ పార్టీలకు, విదేశీ యాత్రలకు వెళ్తున్నారు. మరో దేశంలో ప్రజలు నిరాడంబరంగా బతుకుతున్నారు. తోటివారికి అండగా నిలుస్తున్నారు. భారతీయుడిలా ఆలోచిస్తూ.. భారతీయ సంప్రదాయాలను అనుసరిస్తున్నారని రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీని పోల్చుతూ చురకలటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+