టెక్కీ లవ్ స్టోరీ, వేరే అమ్మాయితో పెళ్లి, సీక్రెట్ ఫోటోలు షేర్ చేసిన ప్రియురాలు, రివాల్వర్ తో కాల్చి

బెంగళూరు: నిశ్చితార్థం జరిగిన తరువాత తన పెళ్లి రద్దుకావడానికి ప్రియురాలు కారణం అయ్యిందని ఆవేశంలో రివాల్వర్ తీసుకుని ఆమెను కాల్చి హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (టెక్కీ). పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆ టెక్కీ కత్తితో గొంతు కోసుకుని ఆత్యహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. గొంతు ఎక్కువగా తెగిపోవడంతో ఆసుపత్రిలో టెక్కీ మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. బెంగళూరులో నడిరోడ్డులో నివాసం ఉంటున్న పీజీ ముందే యువతిని ఆమె ప్రియుడు రివాల్వర్ తో కాల్చి చంపడానికి ప్రయత్నించడంతో ఆ ప్రాంతం ప్రజలు హడలిపోయారు.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లవ్

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లవ్

ఒడిశాకు చెందిన అమరేంద్ర పట్నాయక్ (33) సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఒరిసాకు చెందిన శుభశ్రీ (25) బెంగళూరు నగరంలోని నిమ్హాన్స్ లో ఉద్యోగం చేస్తున్నది. అమరేంద్ర పట్నాయక్, శుభశ్రీ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వారికి పరిచయం అయ్యింది. అమరేంద్ర పట్నాయక్, శుభశ్రీల పరిచయం ప్రేమగా మారడంతో వారు ఇంత కాలం ప్రేమించుకున్నారు.

బెంగళూరులో ప్రియురాలు

బెంగళూరులో ప్రియురాలు

ప్రేమలో పడిన అమరేంద్ర పట్నాయక్, శుభశ్రీ ఆరు నెలల క్రితం వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం అమరేంద్ర పట్నాయక్ ఒరిశాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. శుభశ్రీ మాత్రం గత రెండు సంవత్సరాల నుంచి బెంగళూరులోని మారతహళ్ళిలోని మంజునాథ నగగర్ లోని మునేకోళ్లాళలోని ఓ పీజీలో నివాసం ఉంటూ ఇక్కడే ఉద్యోగం చేస్తున్నది.

నీకు ఎంత ధైర్యం!

నీకు ఎంత ధైర్యం!

నెల క్రితం అమరేంద్ర పట్నాయక్ కి అతని తల్లిదండ్రులు వేరే అమ్మాయిని చూసి పెళ్లి నిశ్చయం చేశారు. ఇటీవల తల్లిదండ్రులు చూసిన అమ్మాయితో అమరేంద్ర పాట్నాయక్ పెళ్లి నిశ్చితార్థం చేసుకున్నాడు. అమరేంద్ర పట్నాయక్ పెళ్లి నిశ్చితార్థం జరిగిపోయిందని అతని ప్రియురాలు శుభశ్రీకి తెలిసిపోయింది. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నీకు ఎంత ధైర్యం ఉంటే వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుంటావని ప్రియురాలు శుభశ్రీ అమరేంద్ర పట్నాయక్ ను నిలదీసింది.

 ప్రియురాలి దెబ్బకు పెళ్లి ఢమాల్

ప్రియురాలి దెబ్బకు పెళ్లి ఢమాల్

అమరేంద్ర పట్నాయక్ తనను మోసం చేశాడని అతని ప్రియురాలు శుభశ్రీ రగిలిపోయింది. ప్రేమించుకుని ఇద్దరు కలిసిమెలసి తిరిగిన సమయంలో ఏకాంతంగా తీసుకున్న కొన్ని ఫోటోలను శుభశ్రీ అమరేంద్ర పట్నాయక్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయికి పంపించింది. అంతే తనకు కాబోయే భర్త ఇంతకు ముందే వేరే అమ్మాయిని ప్రేమించాడని, ఇద్దరు కలిసి ఇంత కాలం తిరుగుతూ ఏకాంతంగా ఫోటోలు తీసుకున్నారని తెలుసుకున్న అమ్మాయి తాను ఈ పెళ్లి చేసుకోనని ఎదురు తిరగడంతో పెళ్లి ఆగిపోయింది.

 పగతో ప్రియురాలిని రివాల్వర్ తో కాల్చి!

పగతో ప్రియురాలిని రివాల్వర్ తో కాల్చి!

తన పెళ్లి ఆగిపోవడానికి తన ప్రియురాలు శుభశ్రీ కారణం అని తెలుసుకున్న టెక్కీ అమరేంద్ర పాట్నాయక్ రగిలిపోయాడు. నాటు రివాల్వర్ తీసుకున్న అమరేంద్ర పట్నాయక్ బెంగళూరు చేరుకున్నాడు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు నిమ్హాన్స్ లో ఉద్యోగం ముగించుకున్న శుభశ్రీ నేరుగా మారతహళ్ళిలో ఆమె నివాసం ఉంటున్న పీజీ దగ్గరకు చేరుకుంది. ఆ సమయంలో పీజీ ముందు మకాం వేసిన అమరేంద్ర పట్నాయక్ 7.65 ఎం.ఎం. రివాల్వర్ తీసుకుని ఒక్కసారిగా ఆమె మీద కాల్పులు జరిపాడు.

భయంతో గొంతు కోసుకుని!

భయంతో గొంతు కోసుకుని!

రివాల్వర్ తో కాల్చడంతో శుభశ్రీ కుప్పకూలిపోయింది. వెంటనే పోలీసులు స్థానికుల సహాయంతో శుభశ్రీని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైట్ ఫీల్డ్ విభాగం డీసీపీ అనుచేత్ రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అమరేంద్ర పట్నాయక్ కోసం గాలించారు. మారతహళ్ళి బ్రిడ్జ్ సమీపంలో అమరేంద్ర పట్నాయక్ తలదాచుకున్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే అప్పటికే భయంతో అమరేంద్ర పట్నాయక్ గొంతు కోసుకోవడంతో స్పృహ తప్పిపడిపోయిన విషయం గుర్తించిన పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.

ఐసీయూలో ప్రేమికులు

ఐసీయూలో ప్రేమికులు

పదునైన కత్తితో గొంతు కోసుకోవడంతో అది ఎక్కువగా తెగిపోయిందని, అమరేంద్ర పట్నాయక్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. తుపాకి గుండు దూసుకుపోవడంతో శుభశ్రీ కూడా ఐసీయూలో చికిత్స పొందుతోంది. అమరేంద్ర పట్నాయక్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి విచారణ చేస్తున్నామని డీసీపీ అనుచేత్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+