దుకాణం వెళ్లిన అమ్మాయిపై షెటర్ మూసేసి రేప్ చేశాడు

పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం బాధిత అమ్మాయి స్థానిక దుకాణానికి వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్ళింది. లోపలికి పిలిచిన యజమాని దుకాణ షెటర్ మూసేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వత ఇంటికి వచ్చిన అమ్మాయి తన తల్లితో విషయం చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరో ఘటనలో ఓ 16ఏళ్ల యువతిపై ముగ్గురు యువకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఆమె పొలం పనులకు వెళుతున్న సమయంలో ఆమెను అడ్డగించిన యువకులు ఆమెపై అత్యాచారానికి యత్నించారు. ఈ ఘటన షామ్లి జిల్లాలో చోటు చేసుకుంది.
పొలంలో పని చేస్తున్న తన తండ్రికి భోజనం తీసుకెళుతున్న సమయంలో సోహన్వీర్, మోనూ, రవి అనే ముగ్గురు యువకులు ఆ యువతిని సమీపంలోని చెరకు తోటలోకి ఎత్తుకెళ్లారు. అక్కడే ఆమెపై అత్యాచారానికి యత్నించారు. ఆమె వారిని అడ్డుకుని అరుపులు కేకలు వేయడంతో అటుగా వెళుతున్న కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకోవడంతో యువకులు పరారయ్యారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications