ధర్డ్‌వేవ్ ఎదుర్కొనేందుకు ఢిల్లీ ఏర్పాట్లు- షాపులకు సరి-బేసి విధానం- కేజ్రివాల్ ప్రకటన
ఢిల్లీలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. గతంలో రోజువారీ వేల కేసులు నమోదవుతుండగా.. తాజాగా ఆ సంఖ్య 400కు తగ్గిపోయింది. అయితే త్వరలో కరోనా మూడో దశ విజృంభించవచ్చన్న సంకేతాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రివాల్ సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఢిల్లీలో కరోనా అదుపులోనే ఉందని భావిస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. అయితే రాబోయే కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే చర్యలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగానే ఢిల్లీలో షాపుల్ని సరి-బేసి విధానంలో తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు కేజ్రివాల్ తెలిపారు. రోజుకు గరిష్టంగా 37 వేల కేసులు వచ్చినా ఎదుర్కొనేలా తాము సన్నద్ధవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీపై కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో దీన్ని ఎదుర్కొనేందుకు వీలుగా పీడియాట్రిక్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుతో పాటు 420 మిలియన్ టన్నుల ఆక్సిజన్‌ను నిల్వచేస్తున్నట్లు సీఎం కేజ్రివాల్ తెలిపారు. ధర్డ్‌వేవ్‌లో చిన్నపిల్లలపై ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉందన్న అంచనాలతో ఈ చర్యలు చేపట్టామన్నారు. థర్డ్‌వేవ్‌పై సూచనల కోసం రెండు డాక్టర్ల కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో ఒకటి కరోనా చికిత్సకు అవసరమైన మందుల్ని సూచించేందుకు, రెండవది కరోనా మందులపై వచ్చే రూమర్లపై స్పష్టత ఇచ్చేందుకన్నారు. అలాగే ఢిల్లీలో రెండు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లూ ఏర్పాటు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications