భారత్‌లోనే: భర్త దాడిలో గాయపడిన అఫ్ఘాన్ యువతి
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ దేశానికి చెందిన 18ఏళ్ల యువతి మనదేశంలోని న్యూఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె భర్త దాడికి పాల్పడటంతోపాటు కాల్చడంతో షకిలా జరీన్‌కు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో కోలుకుంటోంది. అయితే తాను తిరిగి తన స్వదేశానికి వెళ్లనని చెబుతోంది. తాను ఇక్కడే చదువుకుని స్థిరపడిపోతానని జరీన్ పేర్కొంది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా జరీన్‌కు 17ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే తమ బంధువైన 31ఏళ్ల వ్యక్తితో వివాహం చేశారు ఆమె కుటుంబసభ్యులు. దీంతో ఆమె ఉన్నత చదువులు చదువుకోవాలనే కోరిక ముగింపు పలకాల్సి వచ్చింది. అయితే ధైర్యంగా తన కుటుంబ సభ్యులు, భర్తను ఎదిరించిన జరీన్.. చదువుకోవాలని నిశ్చయించుకుంది. కానీ ఈ నిర్ణయం తన భర్తకు నచ్చకపోవడంతో గత డిసెంబరులో ఆమెపై దాడికి దిగాడు.

గాయాలపాలైన బాధితురాలు జరీన్ చికిత్స కోసం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి చేరుకుంది. ఆమె బంధువులు అమెరికా సహాయం కోరినప్పటికీ.. మనదేశం వైద్య సహాయం అందించేందుకు ముందుకు రావడంతో ఇక్కడ చేరింది బాధితురాలు. ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో ఆమెకు 3 శస్త్రచికిత్సలు చేశారు వైద్యులు. ఆమె తొడకు సంబంధించిన ఛర్మాన్ని ముఖంపై అంటించారు.
ప్రస్తుతం కోలుకున్న జరీన్, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. బాధితురాలితోపాటు ఆమె తల్లి వెంట ఉంది. అయితే తిరిగి తమ దేశానికి వెళితే తనను భర్త చంపేస్తాడని భయాందోళనకు గురవుతోంది. దీంతో ఆమె ఇక్కడే స్థిరపడిపోతానని చెబుతోంది. అయితే భారత విదేశీ విధానాలు అందుకు అనుకూలంగా లేవు. జరీన్ విషయంలో భారత్, ప్రత్యేక చర్యలు చేపడితే ఆమె కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. కాగా, జరీన్ తన దేశానికి వెళితే ఆమెపై భర్త, భర్త తరపు బంధువులు దాడికి పాల్పడే అవకాశం ఉందని షకిలాకు ఆర్థిక సహాయం అందించిన అమెరికాలోని ప్రవాస అఫ్ఘాన్ అరిజో కోహిస్తానీ తెలిపారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications