కన్నడ రియల్ స్టార్ ఉపేంద్రకు శ్రీరామ సేన మద్దతు, రాజకీయాలపై చర్చ, కలిసి పోటీ !

స్యాండిల్ వుడ్ రియల్ స్టార్, దర్శకుడు, నిర్మాత ఉపేంద్రకు శ్రీరామ సేన సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

బెంగళూరు: స్యాండిల్ వుడ్ రియల్ స్టార్, దర్శకుడు, నిర్మాత ఉపేంద్రకు శ్రీరామ సేన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బెంగళూరులోని ఉపేంద్ర ఇంటికి శ్రీరామ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ తదితరులు చేరుకుని రియల్ స్టార్ కు మద్దతు ప్రకటించారు.

ఉపేంద్ర, ప్రమోద్ ముతాలిక్ దాదాపు రెండు గంటల పాటు రాజకీయాల గురించి చర్చించారు. దక్షిణ కన్నడ జిల్లాల్లో శ్రీరామ సేనకు బలమైన క్యాడర్ ఉంది. ఈ సందర్బంలో ఉపేంద్ర, ప్రమోద్ ముతాలిక్ భేటీ రాజకీయంగా ప్రభావం చూపించనుంది.

Shriram Senas Pramod Mutalik support to Upendra

ఇటీవల ఉపేంద్ర తాను రాజకీయాల్లో వస్తానని చెప్పడం, ప్రజాకీయం అని పేరు పెట్టడం తెలిసిందే. ఈ సందర్బంలో ప్రమోద్ ముతాలిక్ హీరో ఉపేంద్రకు రాజకీయ సలహాలు, సూచనలు ఇచ్చారని తెలిసింది. ఈ విషయంపై రియల్ స్టార్ ఉపేంద్ర, ప్రమోద్ ముతాలిక్ ఏ విషయాలు బయటకురాకుండా జాగ్రత్తపడ్డారు. ఉపేంద్రకు ఇప్పటికే రాజకీయంగా ఊహించని రీతిలో ప్రజల నుంచి మాద్దతు వస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+