ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‎ గా ఉన్నావ్.. క్యాండీ క్రష్‌ లో 22,222 వ లెవల్ ను దాటేశాడు..

మనం మొబైల్ ఫోన్లలో ఆడే గేమ్స్ లో క్యాండీ క్రష్ ఒకటి. క్యాండీ క్రష్ గేమ్ ను పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా ఆడుతుంటారు. టైమ్ పాస్ కు ఇలాంటి గేమ్స్ ఆడటం ఎక్కువగా జరుగుతుంది. ఈ గేమ్ లో లెక్కలేనన్ని లెవెల్స్ ఉంటాయి. ఒక్కో లెవెల్ ను పూర్తి చేస్తే మరో లెవెల్ కు వెళ్తారు. అలా ఆడుకుంటూ వెళ్తూనే ఉండొచ్చు.

అయితే బిహార్ కు చెందిన శుభమ్ కుమార్ అనే 19 ఏళ్ల యువకుడు క్యాండీ క్రష్ సాగా గేమ్ లో ఏకంగా 22, 222వ లెవల్ ను దాటేశాడు. ఇన్ని వేల లెవెల్స్ ను పూర్తి చేయడం అంటే మాటలు కాదు. ఈ ఆటపై ఎంతో ఇష్టం, ఓర్పు, సహనం, ఆసక్తి ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. శుభమ్ కుమార్ 22, 222వ లెవల్ ను పూర్తి చేయడంతో అరుదైన ఘనతను సాధించాడు. అంతేకాక ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ టీనేజర్స్ విభాగంలో చోటు సంపాదించాడు. బిహార్ లోని దిగ్వారాకు చెందిన శుభమ్ కుమార్ ఈ ఘనతను 2026, జూలై 5 న పూర్తి చేశాడు.

"హైయెస్ట్ లెవెల్ అచీవ్డ్ ఇన్ క్యాండీ క్రష్ సాగా" అనే కేటగిరీ కింద ఆయన ఈ రికార్డును నమోదు చేయడం విశేషం. ఆర్గనైజేషన్ అధికారిక వెబ్ సైట్ పొందుపరిచిన వివరాల ప్రకారం.. ఈ ఘనతను 2026, జూలై 5 న పూర్తి చేశాడు. ఆ సమయంలో శుభమ్ కుమార్ వయసు 19 సంవత్సరాల 8 నెలల 25 రోజులుగా ఉంది. రికార్డు ప్రకారం శుభమ్ కుమార్ బిహార్ లోని దిగ్వారా కు చెందినట్లుగా సమాచారం. అయితే ఎవరైనా అకాడమిక్ రిజల్ట్స్, పోటీ పరీక్షలు, కెరీర్ లక్ష్యాల్లో ఇలాంటివి సాధించినప్పుడు పేరు మారుమోగతుంది.

ShubhamKumar young man Bihar has surpassed Level 22 222 in Candy Crush Saga Guinness World Record

కానీ శుభమ్ విషయంలో మాత్రం ఓ మొబైల్ గేమ్ లో ఈ రికార్డు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో ఇలాంటి గేమ్స్ పై అతని ఆసక్తిని ప్రదర్శిస్తోంది. అయితే శుభమ్ ప్రస్తుతం ఏం చదువుతున్నాడు..? అతని క్వాలిఫికేషన్ ఏంటి..? స్కూల్, కాలేజీ వివరాలను మాత్రం వెల్లడించలేదు. అలాగే శుభమ్ కుమార్ క్యాండీ క్రష్ సాగాలో ఈ లెవెల్ కు చేరుకోవడానికి ఎంత సమయం పట్టిందనే విషయాలు తెలియలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+