కోర్టుల చుట్టూ తిప్పాలని: మోడీ, బ్లాక్ మనీయా: సిబాల్

కేంద్రం తనను ఏమీ చేయలేక ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని ధ్వజమెత్తారు. గుజరాత్ అభివృద్ధి పైన కాంగ్రెసు పార్టీ అబద్దపు ప్రచారం చేస్తోందని, దానిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. దేశంలో యువ రక్తం ఉందని, 65 శాతం యువతరమే ఉందన్నారు. అలాంటి యువతకు కనీస ఉపాధిని కల్పించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు కనీస మద్దతు ధరను ఇవ్వడం లేదని, ఆత్మహత్యలు చేసుకుంటున్నా కళ్లు తెరవడం లేదని మండిపడ్డారు. ఎన్డీయో పాలనలో ధరల నియంత్రణ ఉండేదన్నారు. బిజెపి అధికారంలో ఉన్నచోట సుపరిపాలన ఉందన్నారు. వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పిన యూపిఏ వంద నెలలు దాటిన తర్వాత కూడా ఆ పని చేయలేకపోయిందన్నారు.
ర్యాలీలకు నిధులెక్కడివి?: సిబాల్
మోడీ పైన కేంద్రమంత్రి కబిల్ సిబాల్ ఢిల్లీలో మండిపడ్డారు. మోడీ నల్లధనానికి వ్యతిరేకంగా మాట్లాడుతారని కానీ, బిజెపి నిర్వహిస్తున్న భారీ ర్యాలీల సంగతేమిటని ప్రశ్నించారు. ఒక్కోచోట పది నుడి పదిహేను కోట్లకు తక్కువ కానీ ఖర్చుతో సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారని, వాటి లెక్కల సంగతేమిటో చెప్పాలన్నారు.
ప్రధాని పదవిని ఎప్పుడు చేపడతానా అని మోడీ ఆరాటపడుతున్నారన్నారు. మోడీ దేశ ఐక్యతను నిజంగానే కోరుకుంటే అది ఆయన హృదయం నుండి రావాలన్నారు. మోడీకి నాయకత్వ లక్షణాలు లేవని అభిప్రాయపడ్డారు. మోడీ ఎప్పుడు విదేశీ విధానం పైన, విద్య తదితరాల పైన మాట్లాడలేదన్నారు.
అతనికి ప్రణాళిక లేదన్నారు. అలాంటి వ్యక్తి భారత దేశాన్ని కాంగ్రెసు నాశనం చేస్తోందని చెప్పడం విడ్డూరమన్నారు. మోడీకి చరిత్ర తెలియదన్నారు. అలాంటి వ్యక్తి దేశాన్ని ఎలా పాలించగల్గుతారన్నారు. మోడీ తన ర్యాలీలు, సభలలో బ్లాక్ మనీని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అన్నింటి పైన మోడీతో చర్చించేందుకు సిద్ధమన్నారు. మరోవైపు కాంగ్రెసు ప్రధాని అభ్యర్థిని ప్రకటించాక చర్చకు తాము సిద్ధమని బిజెపి ప్రతి సవాల్ చేసింది.












Click it and Unblock the Notifications