అందరికి దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇచ్చిన సిద్దూ, డీకేశీ, కొండమీద ఒకేసారి !
బెంగళూరు/మైసూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నెల రోజుల నుంచి తీరికలేకండా ఎన్నికల ప్రచారం చేసిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్, కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య అందరికి షాక్ ఇచ్చారు. ఒకే సారి మైసూరులోని చాముండికొండ మీదకు వెళ్లిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ చాముండేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు చేశారు.
మైసూరు జిల్లాలోని వరుణా నియోజక వర్గంలో సిద్దరామయ్య పోటీ చేస్తున్నారు. రామనగర జిల్లాలోని కనకపుర నియోజక వర్గం (బెంగళూరు శివార్లు) నుంచి డీకే. శివకుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీ కోసం మాజీ సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటాపోటీ ఉందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారు అని ఇంతవరకు ఆ పార్టీ హైకమాండ్ క్లారిటీ ఇవ్వలేదు. డీకే శివకుమార్, సిద్దరామయ్య సీఎం సీటు కోసం గొడవలు పడుతున్నారని ఇంతకాలం బీజేపీ, జేడీఎస్ పార్టీల నాయకులు ఆరోపించడంతో అదే నిజమేమో అని కర్ణాటక ప్రజలు అనుకున్నారు.

అయితే మంగళవారం మైసూరులోని చాముండికొండ మీదకు సిద్దరామయ్య, డీకే. శివకుమార్ ఒకేసారి వెళ్లి అందర్ని ఆశ్చర్యానికి గురి చేశారు. ఒకేసారి కలిసి కొబ్బరి కాయలు కొట్టిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు డీకే. శివకుమార్, సిద్దరామయ్య చాముండేశ్వరి దేవి ఆశీర్వాదం తీసుకున్నారు.
మేము కలిసే ఉన్నామని చెప్పడానికి ఇద్దరూ నాయకులు చాముండికొండ మీదకు వెళ్లి అమ్మావారిని దర్శనం చేసుకున్నారు. అయితే మీడియా కంటపడిన సిద్దరామయ్య, డీకే. శివకుమార్ మేము ఇక్కడికి అమ్మవారి దర్శనం కోసం వచ్చామని చెప్పారు. అయితే మాజీ సీఎం సిద్దరామయ్య కాని, డీకే శివకుమార్ కాని రాజకీయాల గురించి ఒక్కమాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications