మృతుల కుటుంబాలకు పరిహారం రూ. 25 లక్షలకు పెంపు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్-2025 టైటిల్ గెలుచుకున్న సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన RCB విజయోత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అభిమానులు వేల సంఖ్యలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్దకు తరలివచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే తొలుత మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కానీ ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆ పరిహారాన్ని రూ. 25 లక్షలకు పెంచుతూ సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ వివరాలను పంచుకున్నారు.

Siddaramaiah s Key Move Rs 25 Lakh for Bengaluru Stampede Victims Families

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని రూ. 25 లక్షలు పెంచుతూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం వీళ్లంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఇటీవల కీలక ప్రకటన చేసింది. తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టును సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఈ ఘటన జరగడం దురదృష్టకరం అని ఆర్సీబీ పేర్కొంది. ఈ ఘటనలో గాయపడిన అభిమానులను.. RCB కేర్స్ ఫండ్ ద్వారా ఆదుకుంటామని స్పష్టం చేసింది.

ఇక తాజాగా ఈ ఘటనలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది. ఈ ఘటనకు ప్రధాన కారణం విరాట్ కోహ్లీ అని రియల్ ఫైటర్స్ ఫోరం అనే సామాజిక సంస్థ అధ్యక్షుడు వెంకటేశ్.. కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. కోహ్లీపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెంకటేశ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+