తేజస్వి రాజీనామా చేయాల్సింది: సొంత ఎమ్మెల్యేలు
గ్రాండ్ అలయెన్స్ విచ్ఛిన్నానికి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబమే కారణమని ఆయన పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)లోని ఓ వర్గం భావిస్తోందని తెలుస్తోంది.
పాట్నా: గ్రాండ్ అలయెన్స్ విచ్ఛిన్నానికి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబమే కారణమని ఆయన పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)లోని ఓ వర్గం భావిస్తోందని తెలుస్తోంది.
తేజస్వీ యాదవ్ రాజీనామా చేయాలని ఆర్జేడీ పార్టీ ఎమ్మెల్యేలు కోరుకున్నారని ఎమ్మెల్యే మహేశ్వర్ యాదవ్ చెప్పారు.

బీహార్‌లో అలయెన్స్ విచ్ఛిన్నం కావడంపై స్పందించిన ఆ పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కి నిష్కళంక నాయకుడిగా పేరుందని చెప్పారు.
పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యేలు తేజస్వీ యాదవ్ తన పదవికి రాజీనామా చేయాలని కోరుకున్నారని చెప్పారు. ఆయన వైదొలిగినట్లైతే కూటమి కొనసాగేదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications