సిక్కు మానవత్వం భేష్: పసివాడి ప్రాణం కోసం మతవిశ్వాసం పక్కకు

మెల్బోర్న్/భోపాల్: ఏ సిక్కు వ్యక్తి మానవత్వాన్ని చాటుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఓ బాలుడు రక్తస్రావాన్ని అపేందుకు తన తలపాగాను (టర్బన్) తీశాడు. బాలుడు గాయంతో బాధపడుతుంటే అతడు మతవిశ్వాసాన్ని పక్కన పెట్టి మానవత్వం చాటాడు. దీంతో, అతనిని అందరూ భేష్ అంటున్నారు.

బడికెళ్తున్న ఓ బాలుడిని ఒక కారు ఢీకొంది. తీవ్రగాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ చిన్నారిని అటుగా వెళ్తున్న హర్మాన్‌ సింగ్‌ (22) అనే యువకుడు చూశాడు. బాలుడి తల నుంచి రక్తం కారిపోతుండటంతో తన తలపాగాను తీసేసి అతడి తలకు చుట్టాడు.

సిక్కు మతాచారం ప్రకారం బహిరంగంగా తలపాగా తీయకూడదు. ఆ విషయం తనకు తెలిసినా పసివాడి ప్రాణం కాపాడేందుకే అలా చేశానని హర్మాన్‌ చెప్పాడు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఈ సంఘటన జరిగింది.

 Sikh Man in New Zealand Lauded Worldwide for His Selfless Act

ఆ సమయంలో తాను సంప్రదాయం గురించి ఆలోచించలేదని, జరిగిన ప్రమాదాన్ని మాత్రమే చూశానని హర్మాన్ సింగ్ చెప్పారు. హర్మాన్ సింగ్ ఘటన పైన న్యూజిలాండ్ హెరాల్డ్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

మత ధర్మాల ప్రకారం టర్బన్ తీయడం చాలా పెద్ద తప్పని, వాటిని మరిచి మానవత్వం చూపిన హర్మాన్ అభినందనీయుడని కొనియాడింది. హర్మాన్ టర్బన్‌ను తీస్తున్న సమయంలో అక్కడ ఉన్న మరో యువకుడు ఫోటో తీసి సామాజిక అనుసంధాన వేదికల్లో ఉంచాడు.

నగలతోపాటు పెళ్లి కూతురు అపహరణ

గుజరాత్ ‌- మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లో దొంగలు పెళ్లి బృందాన్ని దోచుకోవటంతోపాటు నవవధువును కూడా ఎత్తుకెళ్లారు. గుజరాత్‌ యువతికి మధ్యప్రదేశ్‌ యువకుడితో పెళ్లి జరిగింది. పెళ్లి ముగించుకుని అర్ధరాత్రి వరుడి ఇంటికి బయలుదేరిన పెళ్లి బృందం రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోకి రాగానే దోపిడి దొంగలు దాడిచేసి అందరినీ దోచుకున్నారు. ఆ దొంగల్లో కొందరిని పెళ్లి కూతురు గుర్తుపట్టి అరవటంతో ఆమెను కూడా తమతో ఎత్తుకెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+