రెచ్చిపోయిన ఉగ్రవాదులు: కాల్పుల్లో సిక్కు యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌​లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌​లోని షాల్ కదల్​ ప్రాంతంలో పంజాబ్‌​కు చెందిన ఓ కార్మికుడిని కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఇతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కాశ్మీర్​ పోలీసులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌కు చెందిన అమృత్‌పాల్ సింగ్‌ను బుధవారం రాత్రి 7 గంటలకు గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్చిచంపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అమృత్​పాల్​ సింగ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో స్థానికేతర కార్మికుడు రోహిత్ (25) అనే వ్యక్తి గాయపడినట్లు చెప్పారు.

Sikh youth Shot Dead By Terrorists In Srinagar, Another Injured

ఎస్​ఎంహెచ్​ఎస్​ ఆస్పత్రిలో అతడు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఉగ్రవాదుల ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ ఏడాది కశ్మీర్‌లో స్థానికేతరులపై ఉగ్రవాదులు దాడి చేయడం ఇదే తొలిసారి. అయితే, గతంలోనూ ఇలాంటి ఘటనలో చాలానే చోటు చేసుకున్నాయి.

గత సంవత్సరం అనంత్‌నాగ్, షోపియాన్ జిల్లాల్లో స్థానికేతర కార్మికులపై ఉగ్రవాదులు అనేకసార్లు దాడులకు పాల్పడ్డారు. మే 30వ తేదీ అనంత్‌నాగ్ జిల్లాలో సర్కస్ కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. బీహార్‌కు చెందిన ఇటుక బట్టి కార్మికుడు ముకేశ్ కుమార్‌ను అక్టోబర్ 31న పుల్వామా జిల్లాలో కాల్చి చంపారు. జులై 13న షోపియాన్ జిల్లాలోని గాగ్రెన్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు కూలీలు గాయపడ్డారు.

తాజాగా ఘటనపై స్థానిక రాజకీయ పార్టీల నేతలు విచారం వ్యక్తం చేశారు. స్థానికేతరులపై జరిగిన దాడిని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా ఖండించారు. 'శ్రీనగర్‌లోని షాల్ కదల్​లో కార్మికుడు అమృత్ పాల్ సింగ్ ప్రాణాలను ఉగ్రవాదులు బలిగొన్న అనాగరిక ఘటన తెలిసి ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతికి లోనయ్యారు. వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నారు' అని నేషనల్ కాన్ఫెరెన్స్​ పార్టీ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+