వివాదాల్లో మోదీ ఆవిష్కరించిన పుస్తకం.. నిషేధించాలని సిక్కులు డిమాండ్
ప్రధాని మోదీ ఆవిష్కరించిన పుస్తకం ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. తమ సిక్కుల చరిత్రను ఈ పుస్తకంలో తప్పుగా రచించారని సిక్కు సంఘాలు మండిపడుతున్నాయి. తమ మనోభావాలను దెబ్బతీసేవిధంగా విశ్వనాథ్ ధామ్ కా గౌరవశాలీ ఇతిహాస్ పుస్తకంలో ఉన్నాయని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఈపుస్తకాన్ని నిషేధించాలని శిరోమణి గురుద్వారా ప్రబంధన్ కమిటీ డిమాండ్ చేసింది.

వివాదాల్లో విశ్వనాథ్ ధామ్ కా గౌరవశాలీ ఇతిహాస్ పుస్తకం
ఈనెల 13న ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటించారు. ఈపర్యటనలో భాగంగా కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రాజెక్టులోని తొలి దశను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారణాసి స్థల చరిత్రను తెలిపే విశ్వనాథ్ ధామ్ కా గౌరవశాలీ ఇతిహాస్ పుస్తకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ పుస్తకం వివాదాల్లో చిక్కుకుంది. ఆ పుస్తకంలో తమ చరిత్రను వక్రీకరించే విధంగా రచనలు ఉన్నాయని సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ పుస్తకాన్ని నిషేధించాలని శిరోమణి గురుద్వారా ప్రబంధన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. తమ సిక్కుల చరిత్రలకు విరుద్ధంగా రచించారని ఆరోపించింది.

శిరోమణి గురద్వారా ప్రబంధన్ కమిటీ వాదనలు
మొఘలుల నుంచి సనాతన ధర్మాన్ని కాపాడానికి సిక్కు మతం స్థాపన జరిగిందని విశ్వనాథ్ ధామ్ కా గౌరవశాలీ ఇతిహాస్ పుస్తకంలో పేర్కొన్నారని శిరోమణి గురుద్వారా ప్రబంధన్ కమిటీ సభ్యుడు కల్విందర్ సింగ్ రాందాస్ పేర్కొన్నారు. అటు పంజ్ ప్వారాతో కలిసి ఖల్సాపంథాను స్థాపించే ముందు గురుగోవింద్ సింగ్ ఆయన్ను కాశీకి పంపారని .. సనాతన ధర్మం గురించి పూర్తిగా తెలుసుకుని దానిని రక్షించాలని పుస్తకంలో రచించినట్లు ఆయన వెల్లడించారు. ఇది వాస్తవాలకు విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి మతపరమైన విలువలను పరిరక్షించేందుకు, అణచివేతను ఎదుర్కొనేందుకు ఖల్సాపంథా స్థాపన జరిగిందని వివరించారు.

కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజుక్టు
ఈనెల13న కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజుక్టులో తొలి దశను ప్రధాని ప్రారంభించారు. దాదాపు రూ 340 కోట్లతో చేపట్టిన ఈప్రాజెక్టులో భాగంగా యాత్రికుల కోసం 23 కొత్త భవనాలను నిర్మించారు. అటు విశ్వనాధుని ఆలయ ప్రాంగణాన్ని, గంగానది ఘాట్లను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్శంగా మోదీ మాట్లాడుతూ భారత దేశ ఆత్మ వారణాసిని నిశ్చలంగా నిలిచి ఉందనన్నారు












Click it and Unblock the Notifications