Singar: 15 ఏళ్ల అమ్మాయికి టార్చర్, ఆస్తి కోసం సింగర్ ఫ్యామిలీ అరాచకం, చర్చిలో ఫాదర్!
చెన్నై/ హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి చెందిన ప్లేబ్యాక్ సింగర్ కుమార్తెపై లైంగిక వేదింపుల కేసు కొత్త మలుపుతిరిగింది. సాంగ్స్ రికార్డింగ్ లకు హాజరుకావడానికి బయట ఊర్లకు తిరుగుతున్న ప్లేబ్యాక్ సింగర్ ఆమె కుమార్తెను సోదరుడి ఇంటిలో పెట్టింది. బంధువుల ఇంట్లో ఉన్న అమ్మాయి మీద కొందరు బంధువుల కామం కళ్లుపడ్డాయి. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సింగర్ కూతురిని కొందరు బంధువులు, చర్చి ఫాదర్ లైంగిక వేధింపులకు గురి చేసి చిత్రహింసలకు గురి చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పోలీసులు చర్చి ఫాదర్ తో పాటు అమ్మాయి అత్త, బంధువులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

సింగర్ కూతురు
హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ ఆమె 15 ఏళ్ల కూతురితో కలిసి చెన్నైలో నివాసం ఉంటున్నది. తాను బయటకు వెళితే తన కూతురు క్షేమంగా ఉండదని ఆ ప్లేబ్యాక్ సింగర్ సొంత సోదరి, సోదరుడిని ఆశ్రయించింది. చెన్నైలోని సాలిగ్రామ్ లో నివాసం ఉంటున్న సోదరుడి ఇంట్లో కుమార్తెను పెట్టింది. గత 8 సంవత్సరాల నుంచి ఆ ప్లేబ్యాక్ సింగర్ కుమార్తె అత్త ఇంట్లోనే ఆశ్రయం పొందుతోంది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆన్ క్లాస్ ల్లో చదువుతోంది. బాలికకు వరుసకు అత్త అయ్యే మహిళ భర్త పేరు జాన్ జెసిల్.

మామ కాదు పచ్చి కామాంధుడు
అమ్మాయికి వరుసకు మామ అయ్యే జాన్ జెసిల్ కళ్లు అ అమ్మాయి మీదపడ్డాయి. ఇంట్లో ఒంటరిగా చిక్కినప్పుడు ఆ అమ్మాయిని జాన్ జెసిల్ లైంగిక వేధింపులకు గురి చేశాడు. జాన్ జెసిల్ బంధువులు అయిన షకీన్ షాన్, క్లారో అనే ఇద్దరు బంధువులు కూడా అమ్మాయి మీద కన్ను వేసి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసి చిత్రహింసలు పెట్టారు. సింగర్ కుటుంబ సభ్యులు కొందరు ప్రతివారం చర్చికి కూడా వెళ్లి వస్తున్నారు.

స్టోరీ చెప్పితే నీ కథ క్లోజ్
విషయం బయటకు చెబితే చంపేస్తామని ఆ అమ్మాయిని ఇంతకాలం ఈ కామాంధులు బెదరిస్తూ వస్తున్నారు. అమ్మాయి బంధువులు అందరూ క్రైస్తవులు కావడంతో వాళ్లు ఓ చర్చికి వెలుతున్నారు. చర్చిలో ఫాదర్ గా పని చేస్తూ అందరిని మంచి మార్గంలో నడవాలని సూచించాల్సిన చర్చి ఫాదర్ హెన్రీకి ఆ అమ్మాయి పరిచయం అయ్యాయింది. చర్చి ఫాదర్ కూడా ఆ అమ్మాయి మీద కన్ను వేశాడు.

15 ఏళ్ల అమ్మాయి అని కనికరం లేదు
చర్చి ఫాదర్ హెన్రీ కూడా లైంగిక వేధింపులకు గురి చేసి ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని తెలిసింది. ఒకరి తరువాత ఒకరు బంధువులే లైంగిక వేధింపులకు గురి చెయ్యడంతో ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. సహనం కోల్పోయిన అమ్మాయి ఇంతకాలం జరిగిన విషయాలు మొత్తం ప్లేబ్యాక్ సింగర్ అయిన ఆమె తల్లికి చెప్పింది.

10 రోజుల నుంచి ఎస్కేప్
అమ్మాయి తల్లి, ప్లేబ్యాక్ సింగర్ 10 రోజుల క్రితం చెన్నైలోని కీల్ పాక్ పోలీస్ స్టేషన్ లో ఆమె బంధువులు, చర్చి ఫాదర్ మీద కేసు పెట్టింది. అమ్మాయి దగ్గర పోలీసులు స్టేట్ మెంట్ తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి చర్చి ఫాదర్ హెన్రీతో పాటు అమ్మాయి బంధువులు ముగ్గురు పరారైనారు.

ఆస్తి గొడవలు కారణం ?
15 ఏళ్ల అమ్మాయిని చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణలు ఎదుర్కోంటూ ఇన్ని రోజులు తప్పించుకుని తిరుగుతున్న చర్చి ఫాదర్ హెన్నీతో పాటు ఆమె అత్త, మామ, మరో బంధువును సోమవారం చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఆస్తివాదాలు కూడా అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేశాయని సింగర్ అంటోంది. తన కూతురికి జరిగిన అన్యాయానికి నిందితులకు కఠిన శిక్ష పడేలా చెయ్యాలని ఆ సింగర్ పోలీసులకు మనవి చేసింది, కేసు విచారణలో ఉందని పోలీసులు అంటున్నారు. 15 ఏళ్ల అమ్మాయిపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో చర్చి ఫాదర్ హెన్రీ అరెస్టు కావడంతో ఇప్పుడు చెన్నైలో హాట్ టాపిక్ అయ్యింది.
-
అమెరికాలో సంవత్సరం ఆడి సంచలనం సృష్టించిన తెలుగు సినిమా -
Free Bus ఏపీలో ప్రారంభమైన కొత్త పథకం, వారికి కూడా ఇంద్రధనస్సు -
అంచనాలకు అందని బంగారం ధరలు- తలకిందులు -
ట్రంప్ ఆజ్ఞను ధిక్కరించిన సైన్యం.. AI తో ఇరాన్‌పై దాడి -
టీటీడీ వాడి అబ్బ సొత్తా- చంద్రబాబు చెబితే నిమిషంలో రాజీనామా చేస్తా- బీఆర్ నాయుడు -
IND vs WI: స్కోర్ చెప్పేసిన దాదా.. చెమటలు చిందిస్తున్న టీమిండియా -
ఖమేనీ కేవలం నేత కాదు.. కోట్ల మంది మతగురువు: ప్రధాని మోదీకి ఒవైసీ డిమాండ్ -
CBSE Board Exams Deferred: రేపు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు వాయిదా..! -
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. వీళ్లు అస్సలు మిస్ అవ్వొద్దు..! -
Silver:వెండి ధరలకు విస్ఫోటనం సంకేతాలు! సోమవారం ఏం జరగబోతుంది -
చుక్కలు చూపెడుతున్న సిలిండర్ రేట్లు- ఏటీఎఫ్ ధరలకూ రెక్కలు -
ఖమేనీ మృతి: 40 రోజుల పాటు సంతాప దినాలు: కోడలు, అల్లుడు, మనవళ్లు సైతం












Click it and Unblock the Notifications