ఎఫ్‌బీలో 7పేజీల సూసైడ్‌నోట్: గాయని ఆత్మహత్యాయత్నం

న్యూఢిల్లీ: తనపై కేసు పెట్టడంతో పాటు మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని హర్యానాకు చెందిన ఓ గాయని ఆత్మాహత్యాయత్నం చేసింది. దక్షిణ ఢిల్లీలోని నజఫగఢ్‌ ప్రాంతంలో నివసించే సప్నా చౌదరిపై గుడ్‌గావ్‌ పోలీస్‌ స్టేషన్‌లో జులై నెలలో కేసు నమోదైంది.

దళితులను అవమానిస్తూ పాట పాడిందని ఆరోపిస్తూ సప్తల్‌ కుమార్‌ అనే వ్యక్తి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఏడు పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యాయత్నం చేసింది.

Singer attempts suicide over online harassment

సూసైడ్‌ నోట్‌ను ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ఖాతాల్లో పోస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ పాట పాడినందుకు క్షమాపణలు కోరినా.. తనను వేధించడం మానుకోలేదని ఆమె తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది.

ప్రస్తుతం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించామని వైద్యుల పర్యవేక్షణలో ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+