నిర్మానుష్య ప్రదేశంలో కారు ఆపి.. గాయనిపై ఓలా డ్రైవర్ అత్యాచార యత్నం
రాత్రి పూట క్యాబ్ లో ఇంటికి తిరిగి వెళుతున్న ఓ గాయనిపై అదను చూసుకుని డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఉదంతమిది.
బెంగళూరు: తన విధులు ముగించుకుని తెల్లవారుజామున క్యాబ్ లో ఇంటికి తిరిగి వెళుతున్న ఓ గాయనిపై అదను చూసుకుని డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఉదంతమిది. ఆ కామాంధుడి బారి నుంచి తప్పించుకున్న అనంతరం సదరు గాయని తన స్నేహితుల సహాయంతో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బొమ్మనహళ్లి పోలీసుల కథనం ప్రకారం... ఆరోజు తెల్లవారుజామున తన విధులు ముగించుకున్న గాయని కోరమంగళ నుంచి బేగూర్ కు ఓలా క్యాబ్ లో ఇంటికి బయలుదేరింది. క్యాబ్ డ్రైవర్ రవికుమార్ ఓ ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాక బొమ్మనహళ్లి సిగ్నల్ దాటిన తరువాత గబుక్కున మరో రోడ్డులోకి పోనిచ్చాడు.

అది గమనించిన గాయని రూట్ ఎందుకు మార్చావంటూ ప్రశ్నించింది. ఆ మార్గంలో రోడ్డు సరిగా లేదని చెప్పిన డ్రైవర్ రవికుమార్ కొంతదూరం వెళ్లాక నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపాడు. డోర్ తీసుకుని దిగొచ్చి.. బ్యాక్ డోర్ తీసి గాయని పక్కన కూర్చుని ఆమెపై చేయి వేశాడు.
కీడు శంకించిన ఆమె గట్టిగా కేకలు వేస్తూ అతడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. బలవంతంగా కారు డోర్ తీసుకుని కిందికి దిగింది. అయినా రవికుమార్ వదలకుండా ఆమె వెంటపడడంతో గాయని గట్టిగా కేకలు వేసింది.
ఆ కేకలకు ఎవరైనా వస్తారేమో అన్న భయంతో డ్రైవర్ రవికుమార్ అక్కడ్నించి పరారయ్యాడు. ఆ సమయంలో సహాయానికి కూడా వచ్చే వారెవరూ లేకపోవడంతో గాయని వడివడిగా నడుచుకుంటూ సమీపంలోని లక్ష్మి స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకుంది.
అక్కడ్నించి తన స్నేహితులకు ఫోన్ చేసింది. తరువాత వారి సలహా మేరకు ఈ ఘటనపై బొమ్మనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాయని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓలా క్యాబ్ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు నమోదైందని తెలియగానే డ్రైవర్ రవికుమార్ తన ఇంటి నుంచి కూడా పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఓలా యాజమాన్యం కూడా సమాచారం అందగానే ఈ ఘటనకు పాల్పడిన డ్రైవర్ రవికుమార్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications