సింగర్ సిద్దూ హత్య: అనుమానితుడు అదుపులోకి.. మొత్తం ఎంత మంది అంటే...?
సింగర్ సిద్దూపై కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. ఎంతో భవిష్యత్ ఉన్న ఆయనను ఎవరూ మట్టుబెట్టారో తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే మరోస సింగర్ మికా సింగ్ అయితే గ్యాంగ్ స్టార్స్ గురించి ఆరోపణలు చేశారు. హత్య గురించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సిద్దూ హత్యకు సంబంధించి అనుమానితుడిని ఉత్తరాఖండ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను హేమ్ కుంద్ సాహిబ్ యాత్ర జరుగుతుండగా.. అక్కడ నక్కి ఉన్నాడు. అతనిని పోలీసులు పట్టుకున్నారు. అతను లారెన్స్ బిష్ణొయ్ గ్యాంగ్‌కు చెందినవాడు అని పోలీసులు చెబుతున్నారు. అతను సిద్దూను హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. అతనితోపాటు మరో ఐదుగురు అనుమానితులను కూడా ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిని పంజాబ్ తరలిస్తున్నారు.

పంజాబ్ సింగర్ సిద్దూ మూసె వాలాపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు నిన్న జరిపారు. మన్సా జిల్లాలో గల జవహర్కె గ్రామంలో సిద్దూపై ఫైర్ జరిగింది. పంజాబ్ పోలీసులు 424 మందికి భద్రతా విత్ డ్రా చేశారు. ఆ మరునాడే సిద్దూపై అటాక్ చేశారు. మాన్సా నుంచి సిద్దూ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. అయితే ఆప్ అభ్యర్థి విజయ్ సింగ్లాపై 63 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తీవ్రంగా గాయపడిన శుభదీప్ సింగ్ ను హుటాహుటీన మాన్సా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు గాయపడగా, వారికి ప్రాథమిక చికిత్స అనంతరం, మరో ఆస్పత్రికి తరలించారు. శుభదీప్ సింగ్ తన థార్ వాహనంలో స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళుతుండగా కాల్పులు జరిగాయి.












Click it and Unblock the Notifications