దడ పుట్టిస్తోంది: మరణాల సంఖ్యలో టాప్-5 దేశాల్లో భారత్: 18 లక్షలను దాటి: అరలక్షకు పైగా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి మరింత పెరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా కరోనా కూడా రూపాన్ని మార్చుకుంటోందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కొద్దిరోజులుగా 50 వేల లోపే నమోదవుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య దాన్ని అధిగమించడమే కాదు.. అదే దూకుడను కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు పరంపరలో ఏ మాత్రం మార్పు కనిపించట్లేదు. 24 గంటల వ్యవధిలో కొత్తగా 52,972 కేసులు వెలుగులోకి వచ్చాయి. 771 మంది మరణించారు. ఒక్కరోజు వ్యవధిలో అరలక్షకు మించిన కరోనా కేసులు దేశంలో వరుసగా నమోదు అవుతున్నాయి.

Recommended Video

    Mumbai, Pune, Ahmedabad, Chennai, Delhi are among the cities with high Covid-19 cases

    కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 18 లక్షలను దాటింది. ఇప్పటిదాకా 18,03,696 లక్షల కేసులు నమోదు అయ్యాయి. 38,135 మంది మరణించారు. డిశ్చార్జి అయిన వారి సంఖ్య సైతం భారీగా పెరుగుతుండటం ఊరట కలిగించే అంశం. దేశవ్యాప్తంగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 12 లక్షలకు చేరువైంది. ఇప్పటిదాకా 11,86,203 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,79,357గా నమోదైంది.

    Single day spike of 52,972 positive cases and 771 deaths in India in the last 24 hours

    ఈ మేరకు కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే తాజా బులెటిన్‌ను విడుదల చేసింది. కాాగా- దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి బుధవారం వరకు మొత్తం రెండు కోట్ల మార్క్‌ను దాటింది. ఇఫ్పటిదాకా 2,02,02,858 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 3,81,027 మంది నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది. ఇదివరకటి సంఖ్యతో పోల్చుకుంటే ఈ సంఖ్య కాస్త తక్కువే. రోజువారీ కరోనా వైరస్ శాంపిళ్ల పరీక్షలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

    మరణాల సంఖ్య భారత్‌లో ఆందోళనకరంగా పెరుగుతోంది. ఇప్పటిదాకా 38,135 మంది కరోనా వల్ల మృత్యువాత పడ్డారు. అత్యధిక మరణాలను నమోదు చేసిన దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో ఇప్పటిదాకా 1,58,365 మంది మృతిచెందారు. ఆ తరువాతి స్థానంలో బ్రెజిల్ నిలిచింది. బ్రెజిల్‌లో 94,130 మంది చనిపోయారు. మెక్సికోలో 47,746 మంది, బ్రిటన్‌లో 46,201 మంది ప్రాణాలను కోల్పోయారు. ఆ తరువాతి స్థానంలో భారత్ నిలిచింది. 38,135 మంది భారత్‌ చనిపోయారు. 35,154 మరణాలతో ఇటలీ ఆరోస్థానంలో నిలిచింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+