Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీ నుండే స్పూర్తి పొందా: ఎంపీ సుబ్రమణ్యస్వామితో డిఐజీ రూప సెల్ఫీ

బెంగుళూరు: బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామితో కలిసి దిగిన సెల్పీని జత చేస్తూ ఐపిఎస్ అధికారిణి రూప ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామిని ఆమె పొగడ్తలతో ముంచెత్తారు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మీరు చాలా గొప్ప వ్యక్తి, మీరు ఫిర్యాదు చేయకపోతే ఆ వ్యక్తి జైలుకు వెళ్ళేవారు కాదేమో, మీ స్పూర్తితోనే ఆమె జైల్లో చేసిన అక్రమాలను తాను బయటపెట్టాను అంటూ రూప ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌పై విమర్శలు చేస్తున్నారు కొందరు నెటిజన్లు

Sir, you inspire me: IPS officer D Roopa praises ‘versatile’ Subramanian Swamy for jailing Sasikala

మీరు బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఓ వ్యక్తి రూపకు రీట్వీట్ చేశారు.'నేను జైలు రిపోర్టు అందజేయగానే నన్ను బదిలీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక పోలీస్‌ శాఖ ప్రవర్తించింది. అప్పుడు ఎవరూ ప్రశ్నించరు. కానీ, ఇప్పుడు ఓ స్పూర్తిదాయాక వ్యక్తితో ఫోటో దిగితే రాజకీయాలు చేస్తున్నారు. ఇది సరికాదు' అని ఆమె పేర్కొన్నారు.

జయలలిత సీఎంగా ఉన్న కాలంలో అక్రమాలు చోటు చేసుకొన్నాయన్న సుబ్రమణ్యస్వామి ఫిర్యాదుతో తేనెతుట్టే కదిలింది. రెండు దశాబ్దాల పాటు జరిగిన విచారణ తర్వాత బెంగుళూరు కోర్టు గత ఏడాది ఫిబ్రవరిలో జయలలిత ఆమె సన్నిహితురాలు శశికళను కోర్టు దోషులుగా తేల్చింది.

శశికళ జైలులో ఉన్న విఐపీ ట్రీట్ మెంట్ పొందుతున్న విషయాన్ని జైళ్ళ శాఖ అధికారిణి రూప సాక్ష్యాలతో బట్టబయలు చేసింది.జైళ్ళ శాఖ ఉన్నతాధికారులపై కూడ ఆమె ఆరోపణలు చేసింది. దీంతో ఆమెను బదిలీ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+