Sister: అక్క మొగుడిని వెంటాడి చంపిన బావమరిది, భార్య కోసం వెళితే ప్రాణం పోయింది, అసలు మ్యాటర్ ? !
చెన్నై/ రాణిపేట్: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు వివాహం చేసుకుని సంతోషంగా కాపురం చేశారు. వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అయినా దంపతులకు పిల్లలు పుట్టలేదు. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పదేపదే భార్య పుట్టింటికి వెళ్లి నెల రోజులు ఉండటం, తరువాత భర్త ఇంటికి తిరిగి వెళ్లడం చేస్తోంది. ఇటీవల భర్తతో గొడవపడిన మహిళ ఆమె పుట్టింటికి వెళ్లిపోయి భర్త వైపు కన్నెత్తికూడా చూడలేదు. తన భార్య విషయం ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకున్న ఆమె భర్త అత్తారింటికి వెళ్లాడు. ఆ సందర్బంలో బావమరిది అతని అక్క మొగుడిని కుక్కను చంపినట్లు చంపేయడం కలకలం రేపింది.

ఒకే ఏరియాలో యువతి, యువకుడు
తమిళనాడులోని రాణిపేట జిల్లాలోని వాలాజీపేట్ సమీపంలోని కచలనాయకరన్ ప్రాంతంలో అశోకన్ )32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో విజయలక్ష్మి అనే యువతి నివాసం ఉంటున్నది. విజయలక్ష్మి, అశోకన్ కులాలు ఒక్కటే కావడం, దూరపు బంధువులు కావడంతో ఇద్దరికి పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటారని వాళ్ల కుటుంబ సభ్యులు అనుకున్నారు.

పిల్లలు పుట్టలేదని గొడవలు
ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న అశోకన్, విజయలక్ష్మి దంపతులు సంతోషంగా కాపురం చేశారు. వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అయినా విజయలక్ష్మి, అశోకన్ దంపతులకు పిల్లలు పుట్టలేదు. ఇదే విషయంలో అశోకన్, విజయలక్ష్మి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పిల్లలు పుట్టడానికి విజయలక్ష్మికి ఆసుపత్రిలో చూపిస్తున్నారు.

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
భర్త అశోకన్ తో గొడవపడుతున్న అతని భార్య విజయలక్ష్మి ఆమె పుట్టింటికి వెళ్లి రెండు వారాలు, నెల రోజులు ఉండటం, తరువాత మళ్లీ భర్త ఇంటికి తిరిగి వెళ్లడం చేస్తోంది. ఇటీవల భర్త అశోక్ తో పెద్దగా గొడవపడిన విజయలక్ష్మి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మూడు నెలలు అయినా విజయలక్ష్మి ఆమె భర్త అశోకన్ వైపు కన్నెత్తికూడా చూడకుండా పుట్టింటిలోనే మకాం వేసింది.

అక్క మొగుడిని నరికి చంపేసిన బావమరిది
తన భార్య విజయలక్ష్మి విషయం ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకున్న ఆమె భర్త అశోకన్ అత్తారింటికి వెళ్లాడు. ఆ సందర్బంలో అశోకన్, విజయలక్ష్మి దంపతుల మద్య పెద్ద గొడవ జరిగింది. అదే సమయంలో బయట నుంచి ఆంటికి వెళ్లిన విజయలక్ష్మి తమ్ముడు మణి రెచ్చిపోయి అతని బావ అశోకన్ ను చితకబాదేశాడు.

భార్య కోసం వెళితే ప్రాణం పోయింది
తరువాత ఇంటిలోకి వెళ్లిన మణి కొడవల తీసుకువచ్చి అతని అక్క విజయలక్ష్మి భర్త అశోకన్ ను వెంటాడి నరికి చంపేయడం కలకలం రేపింది. బావ అశోకన్ ను హత్య చేసిన మణి అక్కడి నుంచి దర్జాగా తప్పించుకుని పారిపోయాడు. భార్య విజయలక్ష్మికి నచ్చచెప్పి కాపురానికి పిలుచుకుని రావడానికి వెళ్లిన అశోకన్ హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications