సెక్స్ స్కాండల్ కేసు, విదేశాల్లో ప్రజ్వల్ కు సహాయం చేసిన యువతి ఎవరు ?, నోటీసులు !
విదేశాల్లో సైతం వైరల్ అయిన కర్ణాటకలోని హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో కేసు రోజురోజుకు మలుపులు తిరుగుతోంది. ప్రజ్వల్ రేవణ్ణ సిట్ విచారణలో ఉన్నాడు. ఇప్పుడు మాజీ ఎంపీ ప్రజ్వల్ గర్ల్ ఫ్రెండ్ కూడా సిట్ నోటీసులు జారీ చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంలో ఆయన గర్ల్ ఫ్రెండ్ అతనికి సహకారం చేసిందా? అని సిట్ అధికారులు ఆరా తీస్తున్నారని తెలిసింది.
అశ్లీల వీడియో కేసుకు సంబంధించి సిట్ బృందాన్ని ఏర్పాటు చెయ్యడానికి ముందే ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు వెళ్లిపోయారు. హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విదేశాల్లో తలదాచుకునేందుకు సహకరించారనే ఆరోపణలపై ఆయన గర్ల్ ఫ్రెండ్ కి సిట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజల్వ్ రేవణ్ణ విదేశాలకు పారిపోయి తల దాచుకున్నాడని తెలిసిందే. విదేశాల్లో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు రప్పించడానికి సిట్ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు.
పలుమార్లు సిట్ నోటీసులు జారీ చేసినా ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు హాజరుకాలేదని సిట్ అధికారులు కోర్టుకు చెప్పారు. ప్రజ్వల్ రేవణ్ణ సరైన సమయంలో చిక్కకపోవడంతో కేసు దర్యాప్తుకు కుపెద్ద తలనొప్పిగా మారిందని సిట్ అధికారులు అంటున్నారు. కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో ప్రజ్వల్ విదేశాల్లో ఉన్న సమయంలో సిట్ అధికారులకు కీలక పత్రాలు దొరికాయని తెలిసింది.
ప్రజ్వల్ రేవణ్ణ విదేశాల్లో తలదాచుకోవడానికి అతని గర్ల్ ఫ్రెండ్ సహకరించిందని వెలుగు చూడటంతో సిట్ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆమె ప్రజ్వల్ రేవణ్ణకు ఆర్థిక సహాయం కూడా అందించినట్లు సిట్ అధికారులుల అనుమానిస్తున్నారని తెలిసింది. అయితే ప్రజ్వల్ రేవణ్ణ విదేశాల్లో తలదాచుకోవడానికి సహకరించిన ఆమె ఎవరు అని ఇప్పుడు చాలా మంది ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications