గాలి జనార్ధన్ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు

బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డికి మళ్లీ కష్టాలు మొదలైనాయి. బుధవారం ఉదయం కర్ణాటక లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఏకకాలంలో 8 చోట్ల సోదాలు నిర్వహించారు.

బళ్లారి లోని శిరుగుప్ప రోడ్డులో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి నివాసం ఉంది. బుధవారం ఉదయం సిట్ అధికారులు గాలి జనార్దన్ రెడ్డి నివాసంతో పాటు 8 వేర్వేరు ప్రాంతాలలో సోదాలు నిర్వహించి పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

మంగళవారం గాలి జనార్దన్ రెడ్డి ఆప్త సహాయకుడు స్వస్తిక్ నాగరాజ్ ను కర్ణాటకలోని హోస్పేట్ లోని ఆయన ఇంటిలో అరెస్టు చేసి విచారణ చేశారు. స్వస్తిక్ నాగరాజ్ ఇచ్చిన సమాచారం మేరకు సిట్ అధికారులు గాలి జనార్దన్ రెడ్డి ఇంటి మీద దాడులు చేశారని సమాచారం.

SIT raided the residence of former minister Janardhana Reddy in Ballari

అక్రమంగా మైనింగ్ నిర్వహించారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారుల విచారణలో అక్రమంగా ఇనుప ఖనిజం తరలించారని గుర్తించారు. జీబీఎస్ ట్రాన్స్ పోర్టు ద్వారా ఇనుప ఖనిజం విదేశాలకు తరలించారని ఆరోపిస్తు మంగళవారం స్వస్తిక్ నాగరాజ్ ను అరెస్టు చేశారు.

సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం అక్రమంగా తరలించారని సిట్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి, ఆయన ఆప్త సహాయకుల నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకుని అక్రమంగా ఇనుప ఖనిజం తరలించడానికి సహకరించారని ఆరోపిస్తు ప్రభుత్వ అధికారుల మీద ఇప్పటికే కేసు నమోదు చేసిన సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+