Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుప్పకూలిన రైల్వే షెడ్: నిర్మాణంలో ఉండగానే.. భారీ వర్షాలే కారణమా?

హౌరా: నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే షెడ్ కుప్పకూలిపోయింది. నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిన దశలో ఒక్కసారిగా కుంగిపోయిందా షెడ్. ఈ ప్రమాదంలో సుమారు ఆరుమంది కార్మికులు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల వల్లే ఈ ఘటన చోటు చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో హౌరాలోని షాలిమార్ రైల్వే స్టేషన్ లో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. దీనిపై సమగ్ర నివేదికను అందించాలని స్థానిక డివిజినల్ రైల్వే మేనేజర్ ను ఆదేశించారు.

కొంతకాలంగా షాలిమార్ రైల్వే స్టేషన్ లో ఈ షెడ్ నిర్మాణంలో ఉంటోంది. హౌరా నగరంలో అత్యంత రద్దీతో కూడుకుని ఉన్న రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రయాణికుల రద్దీకి తోడు గూడ్స్ ను తరలించాల్సి రావడంతో రైల్వే స్టేషన్ ను విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. రైల్వే స్టేషన్ ఆధునికీకరణలో భాగంగా దీన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. సరుకులు, పార్శిళ్లను భద్రపరచడానికి కొత్తగా ఓ షెడ్ ను నిర్మిస్తున్నారు. రైళ్లకు అవసరమైన సాంకేతిక మరమ్మతులను కూడా చేపట్టే అవకాశం ఈ షెడ్ లో కల్పించినట్లు చెబుతున్నారు.

Six injured after under-construction shed collapses at Shalimar Railway Station

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ షెడ్ ఈ మధ్యాహ్నం కుప్పకూలిపోయింది. కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అసలు కారణాన్ని గుర్తించడానికి విచారణకు ఆదేశించారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో షెడ్ లోపల ఆరుమంది కార్మికులు ఉన్నారు. వారందరూ ఈ ఘటనలో గాయపడ్డారు. వారిని వెంటనే హౌరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో రైల్వే స్టేషన్ లో వేచి ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. పెద్ద శబ్దం చేస్తూ షెడ్ కుప్పకూలడాన్ని పలువురు ప్రయాణికులు తమ సెల్ ఫోన్లలో బంధించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+