బీజేపీ 'భారీ' విజయానికి అడ్డు ఇవే, చివరి నిమిషంలో.. గెలుపుకు కారణాలు
అహ్మదాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. హిమాచల్‌లో కమలం పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. గుజరాత్‌లోని క్లియర్ మెజార్టీ వచ్చినప్పటికీ సీట్లు, ఓట్ల శాతం తగ్గాయి. దీంతో ప్రధాని మోడీ తన తీరును మార్చుకోవాలని విపక్షాలు మాటల దాడి చేస్తున్నాయి.
కానీ బీజేపీకి తక్కువ సీట్లు, తక్కువ ఓట్లు రావడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే, బీజేపీ గెలుపుకు కొన్ని అంశాలు ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఆరేడు విషయాలు బీజేపీ గెలుపును నిర్దేశించాయి.

బీజేపీని పలు అంశాలు దెబ్బతీశాయి
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఆ పార్టీలో ఉత్సాహం నింపింది. అదే సమయంలో ఆశించిన విజయం సాధించకపోవడం నిరుత్సాహమే. నూటా యాభై సీట్లు గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెప్పగా, వంద సీట్లకు పైగా మాత్రమే గెలిచారు. బీజేపీని పలు అంశాలు దెబ్బతీశాయి.

జీఎస్టీ ప్రభావం,
గుజరాత్‌లో వ్యాపారులు ఎక్కువ. జీఎస్టీ ప్రభావం ఎన్నికలపై పడింది. జీఎస్టీ విషయంలో వ్యాపారులు అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారిలో కొందరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ గెలుస్తుందనే నమ్మకం తదితర కారణాలతో చాలామంది కమలం వైపు మొగ్గు చూపారు. అలాగే, మణిశంకర్ అయ్యర్ చివరి నిమిషంలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను దెబ్బతీశాయి. అదే సమయంలో ప్రధాని మోడీ చేసిన 'పాకిస్తాన్' వ్యాఖ్యలు కలకలం రేపాయి.

వడ్డీ లేకుండా రూ.3 లక్షలు
గ్రామీణ ఓటర్లను తమ వశం చేసుకునేందుకు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఎన్నికలకు కొద్ది వారాల ముందు రుణమాఫీని ప్రకటించారు. సున్నా వడ్డీకి రైతులకు రూ.3 లక్షల వరకు వడ్డీ ఇస్తామని ప్రకటించారు. ఇది 25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తుంది.

హార్దిక్ పటేల్ టేప్
హార్దిక్ పటేల్ సెక్స్ టేప్‌లు ఎన్నికల సమయంలో కలకలం రేపాయి. తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ హార్దిక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కానీ ఎన్నికలకు ముందు హార్దిక్ సెక్స్ టేపులు తీవ్ర సంచలనం రేపాయి. మరోవైపు, రాహుల్‌తో కలిసి సల్మాన్ నిజామీ ప్రచారం చేశారు. దీంతో మోడీ గతంలో నిజామీ అఫ్జల్ గురుకు మద్దతుగా, భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడారంటూ వెల్లడించారు. ఇదిలా ఉండగా, కులసంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం బీజేపీని దారుణంగా దెబ్బతీసింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications