వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరు మంది భార్యలు, అందరితో రోమాన్స్, చచ్చాడు, ఒక్క భార్య కూడా రాలేదు, ఎందుకంటే !

అతనికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఆరు మంది భార్యలు ఉన్నారు. ప్రస్తుతం ఐదు మంది భార్యలతో కాపురం చేస్తున్నాడు. ఆరు మంది భార్యలకు పిల్లలు ఉన్నారు.

|
Google Oneindia TeluguNews

గోకాక్/బెంగళూరు: అతనికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఆరు మంది భార్యలు ఉన్నారు. ప్రస్తుతం ఐదు మంది భార్యలతో కాపురం చేస్తున్నాడు. ఆరు మంది భార్యలకు పిల్లలు ఉన్నారు. అయితే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన అతన్ని చూడటానికి ఒక్కరు కూడా రాలేదు.

<strong>అడవిలో లవర్స్ రోమాన్స్: ప్రియుడి ముందే గ్యాంగ్ రేప్, వీడియో యూట్యూబ్ లో !</strong>అడవిలో లవర్స్ రోమాన్స్: ప్రియుడి ముందే గ్యాంగ్ రేప్, వీడియో యూట్యూబ్ లో !

చివరికి అతని అంత్యక్రియల చెయ్యడానికి కుటుంబ సభ్యులు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో గ్రామస్తులు చందాలు వేసుకుని అతని అంత్యక్రియలు నిర్వహించారు. కర్ణాటకలోని బెలగావి జిల్లా చిక్కోడి సమీపంలోని ఇట్నాళ గ్రామంలో నివాసం ఉంటున్న ఈరప్ప నాయక్ (36) అనే వ్యక్తికి అందరూ ఉన్నా అనాధలాగా అంత్యసంస్కారాలు చేశారు.

అరడజను భార్యలు, అందరితో కాపురం !

అరడజను భార్యలు, అందరితో కాపురం !

ఈరప్ప నాయక్ చిన్నచిన్న వ్యాపారాలు చేస్తున్నాడు. ఇతనికి ఆరు మంది భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు, రెండో భార్యకు ఒక కుమారుడు, మూడో భార్యకు ఇద్దరు, నాలుగు, ఐదు, ఆరో భార్యకు ఒక్కొక్కరు చొప్పన పిల్లలు ఉన్నారు.

అందరితో రోమాన్స్

అందరితో రోమాన్స్

ఈరప్ప నాయక్ ఆరు మంది భార్యలతో వేరువేరుగా కాపురం చేస్తున్నాడు. మూడో భార్యకు మాత్రం ఇతను దూరంగా ఉంటున్నాడు. అయితే ఇప్పటి వరకూ ఐదు మంది భార్యలతో ఇతను కాపురం చేస్తు వారితో కలిసి ఉంటున్నాడు.

రోడ్డు ప్రమాదంలో

రోడ్డు ప్రమాదంలో

ఈనెల 20వ తేదీన బైక్ లో వెలుతున్న ఈరప్ప నాయక్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైనాయి. అతన్ని గోకాక్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సోమవారం ఈరప్ప నాయక్ మరణించాడు. ఆసుపత్రి వైద్యులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

ఒక్క భార్య కూడా కన్నెత్తి చూడలేదు

ఒక్క భార్య కూడా కన్నెత్తి చూడలేదు

ఆరు మంది భార్యలు ఉన్న ఈరప్ప నాయక్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని సమాచారం తెలుసుకున్న అతని భార్యల్లో ఒక్కరు కూడా ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడలేదు. కనీసం పిల్లలు, ఈరప్ప నాయక్ తల్లిదండ్రులు, సోదరులు సైతం అటు వైపు రాలేదు.

ఆసుపత్రి బిల్లు చూసి

ఆసుపత్రి బిల్లు చూసి

రోడ్డు ప్రమాదంలో గాయాలై మరణించిన ఈరప్ప నాయక్ ఆసుపత్రి బిల్లు ఇంకా రూ. 60 వేలు పెండింగ్ ఉంది. అక్కడికి వెళితే ఆసుపత్రి బిల్లు చెల్లించాల్సి వస్తోందని అతని ఆరు మంది భార్యలు భయపడ్డారని సమాచారం. అందుకే కనీసం చనిపోయిన భర్తను చూడటానికి వాళ్లు రాలేదు.

పోలీసులు, గ్రామస్తులు

పోలీసులు, గ్రామస్తులు

ఈరప్ప నాయక్ మృతదేహాన్ని తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. చివరికి ఎస్ ఐ గోపాల హళ్లూర గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. మన గ్రామం పరువు పోతుందని ఆందోళనతో గ్రామస్తులు అందరూ చందాలు వేసుకుని ఈరప్ప నాయక్ ఆసుపత్రి బిల్లు చెల్లించి మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకు వచ్చారు.

కడసారి చూపుకు భార్యలు నో !

కడసారి చూపుకు భార్యలు నో !

ఈరప్ప నాయక్ చనిపోయాడని తెలుసుకున్న అతని ఆరు మంది భార్యలు సైతం కడసారి చూడటానికి రాలేదు. కనీసం వారి పిల్లలను పంపించలేదు. చివరికి గ్రామస్తులు అందరూ కలిసి ఈరప్ప నాయక్ అంత్యక్రియలు పూర్తి చేశారు. అందరూ ఉన్నా ఈరప్ప నాయక్ అనాథగానే పైలోకాలకు వెళ్లిపోయాడు.

English summary
Six wifes husband: 37- year- old man killed in road accident near Gokak in Belagavi district in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X