పాఠశాల విద్యార్థినిపై లైంగిక దాడి: పొదల్లో పడేశారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మానవత్వాన్ని మంటగలిపే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడి చేతిలో చిత్రహింసలకు గురైన మరో నిర్భయ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది.
ఢిల్లీలోని ఒక్లా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఎనిమిదేళ్ల బాలికను స్కూలు నుంచి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. అనంతరం చిత్రహింసలకు గురిచేసి, హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఓ 45 ఏళ్ల వ్యక్తి పథకం ప్రకారం బాలిక చదువుతున్న పాఠశాలకు వెళ్లాడు. బాలిక బంధువునని చెప్పి స్కూలు సిబ్బందిని నమ్మించాడు. అతను తన పొరుగువాడే కావడంతో బాలిక కూడా అతని వెంట వెళ్లేందుకు ఒప్పుకుంది.

అక్కడి నుంచి స్కూలు వెనుకనున్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, అత్యాచారం చేశాడు. అనంతరం ఆ చిన్నారిపై కత్తితో దాడి చేశాడు. తలపై బండరాయితో మోదాడు. చనిపోయిందనుకొని అక్కడి నుంచి పారిపోయాడు.
పొదల్లో స్పృహ కోల్పోయి ఉన్న బాలికను గమనించిన స్థానికులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు ఆమెను ఆస్పలో చేర్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి తీవ్రగాయాలతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతోంది.
బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్ననిందితుడి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications