సోదరి, కుక్కల కళేబరాలతో జీవిస్తున్న టెక్కీ అరెస్ట్
కోల్‌కతా: నగరంలోని ఓ ఫ్లాట్‌లో పోలీసులు గురువారం మూడు కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫ్లాట్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో సోదాలు జరిపిన పోలీసులు ఇంటి యజమాని మృతదేహంతోపాటు ఈ మూడు కళేబరాలను గుర్తించారు.
కోల్‌కతాలోని రాబిన్‌సన్ లేన్ వీధిలో ఉన్న ఓ ఫ్లాట్‌ను నుంచి పొగలు బయటకు రావడంతో ఏం జరుగుతుందోనని వెళ్లి చూసిన పోలీసులకు ఓ మహిళ కళేబరంతోపాటు రెండు కుక్కల కళేబరాలు లభ్యమయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. పార్థా డే(47) అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా అసలు కనిపించకుండా ఆ ఇంట్లోనే ఉంటూ అనుమానాస్పదంగా కనిపించాడు. అతని ఇంటి బాత్ రూం నుంచి పొగలు వస్తుండటంతో చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేయగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
అక్కడికి వెళ్లిన పోలీసులకు కాలిపోయిన పార్థాడే తండ్రి అరబిందా డే(77) మృతదేహం, పుర్రె, ఎముకలతో కూడిన బ్యాగు కనిపించింది. అయితే పార్థాడే తండ్రి అగ్ని ప్రమాదంలో చనిపోయాడా? లేక పార్థాడేనే చంపాడా? అనే అనుమానాలున్నాయి. కాగా, ఈ విషయాలపై అతడిని ఆరా తీయగా తనకు తన కుటుంబమంటే చాలా ఇష్టమని చెప్పాడు.

తన సోదరి అంటే ప్రాణమని, సంగీత పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న ఆమెకు తాము ముద్దుగా పెంచుకుంటున్న రెండు కుక్కలంటే చాలా ఇష్టమని, అవి చనిపోవడంతో తన సోదరి చాలాకాలం భోజనం మానేసి నాలుగు నెలల కిందట ప్రాణాలు విడిచిందని చెప్పాడు.
తన తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడని, వారిని దహనం చేయడం ఇష్టం లేక తనతోనే ఉంచుకున్నానని చెప్పాడు. అంతేగాకుండా, తాను ప్రతిరోజు రాత్రి వారి ఆత్మలతో మాట్లాడతానని, తనకు వారు కనిపిస్తారని చెప్పాడు.
దీంతో దిగ్ర్భాంతికి గురైన పోలీసులు.. పార్థా డేను అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోలీసులకు లభించిన పుర్రెను ఒక గుడ్డలో చుట్టి అందులో ఆహారం పెట్టి ఉంచాడు పార్థడే. కాగా, పార్థాడే ఒకప్పుడు ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగిగా పని చేశాడని పోలీసులు తెలిపారు. పార్థాడే ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపాడు.












Click it and Unblock the Notifications