Sketch: సినిమా నటుడు, పైగా రౌడీషీటర్, వజ్రాల వ్యాపారిని కిడ్నాప్, నిజంగా ఖల్ నాయక్, ఎవడంటే !
బెంగళూరు: చిన్నాచితక రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకున్న సినిమా నటుడు, రౌడీషీటర్ తాను పెద్ద రాజకీయ నాయకుడు అంటూ అమాయకుల దగ్గర బిల్డప్ ఇస్తున్నాడు. తొట్టిగ్యాంగ్ ను వెంట వేసుకుని వెలుతున్న అతను నేరాలకు పాల్పడుతున్నాడు. వజ్రాల వ్యాపారిని కిడ్నాప్ చేసిన రౌడీ నారాయణ చివరికి అతని నుంచి రూ. 25 లక్షలు వసూలు చేసి ఖాలీ చెక్ ల మీద సంతకాలు చేసుకుని పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు.
బెంగళూరు నగరంలోని మహాలక్ష్మి లేఔట్ లో నారాయణ్ అలియాస్ జేడీఎస్ నారాయణ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు, కన్నడలో సూపర్ హిట్ అయిన వీరపరంపర, దుష్ట తదితర 40 సినిమాల్లో నారాయణ్ విలన్ గా నటించాడు. సినిమాల్లో విలన్ గా నటిస్తున్న నారాయణ్ నిజజీవితంలో కూడా విలన్ కావాలని ఆశపడ్డాడు.

బెంగళూరు నగరంలోని శివానంద సర్కిల్ సమీపంలో వజ్రాల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తిని సినిమా నటుడు, రౌడీసీటర్ నారాయణ్ అతని అనుచరులతో కలిసి కిడ్నాప్ చేశాడు. వజ్రాల వ్యాపారిని విడుదల చెయ్యాలంటే రూ. 2 కోట్లు ఇవ్వాలని నారాయణ్ అండ్ గ్యాండ్ అతని కుటుంబ సభ్యులను డిమాండ్ చేశాడు.
వజ్రాల వ్యాపారి కుటుంబ సభ్యుల నుంచి రూ. 25 లక్షలు తీసుకున్న నారాయణ్ అండ్ గ్యాంగ్ ఆరు ఖాలీ చెక్ ల మీద సంతకాలు చేయించుకుని అతన్ని వదిలిపెట్టారు.వజ్రాల వ్యాపారి కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కన్నడ సినిమా నటుడు, రౌడీషీటర్ నారాయణ్ తో పాటు అతని గ్యాంగ్ లోని నూతన్, అశ్వథ్, ఉమేష్ అనే నిందితులను అరెస్టు చేశారు. హ్యాపీగా సినిమాల్లో నటిస్తూ కాలం గడపవలసిన నారాయణ్ ఇప్పుడు కిడ్నాప్ కేసులో అరెస్టు అయ్యి జైలుపాలైనాడు.












Click it and Unblock the Notifications