స్కిన్ టు స్కిన్: దుస్తుల మీదుగా వక్షోజాలను తాకినా లైంగిక దాడి అవుతుంది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం.. సంచలన తీర్పును వెలువడించింది. బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడానికి ఉద్దేశించిన ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ (పోక్సో) చట్టం కింద ఇదివరకు బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. లైంగిక దాడుల విషయంలో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అవసరం లేదని స్పష్టం చేసింది. దుస్తులు మీదుగా శరీరాన్ని తాకినా అది లైంగిక దాడిగా భావించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.

బోంబే హైకోర్టు ఏం చెప్పింది..
12 సంవత్సరాల మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తనకు శిక్షను విధించడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి బోంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ఈ పిటీషన్‌పై నాగ్‌పూర్ బెంచ్ విచారణ చేపట్టింది. శరీరాన్ని తాకకుండా అంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేకుండా వేధించడాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని తెలిపింది. ఆ వ్యక్తికి పోక్సో చట్టం కింద దిగువ న్యాయస్థానం విధించిన మూడు సంవత్సరాల కారాగార శిక్షను తగ్గించింది. ఏడాది జైలుశిక్షగా మార్చుతూ బోంబే హైకోర్టు నాగ్‌పూర్ డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.

దుస్తులు తొలగించకుండా..
నిందితుడు ఆ బాలిక దుస్తులను తొలగించకుండా శరీరాన్ని తాకినట్లు విచారణలో తేలిందని, దాన్ని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్‌గా భావించట్లేదని అప్పట్లో బోంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ వ్యాఖ్యానించింది. శరీరాన్ని నేరుగా తాకనందున దాన్ని లైంగిక దాడిగా పరిగణించట్లేదని స్పష్టం చేసింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 7 పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయలేదు బోంబే హైకోర్టు. మైనర్ బాలికపై దాడి చేసిన ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం శిక్షను ఖరారు చేసింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరిలో తీర్పు వెల్లడించింది.

బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంలో అప్పీల్..
బాంబే హైకోర్టు నాగ్‌పూర్ డివిజన్ ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం, జాతీయ మహిళా కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదంటూ పిటీషన్‌ను దాఖలు చేశారు. 12 సంవత్సరాల మైనర్ బాలికను లైంగికంగా వేధించిన నిందితుడికి పోక్సో చట్టం కింద శిక్ష పడేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. లైంగిక దాడికి సంబంధించిన చట్టాల్లో దుస్తుల తొలగింపుపై ఎలాంటి నిబంధనలు గానీ, సెక్షన్లు గానీ లేవని పేర్కొన్నారు. నిందితుడి ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకుని, పోక్సో కింద శిక్షను ఖరారు చేయాలని అన్నారు.

సర్జికల్ గ్లోవ్స్ వేసుకుని మహిళ శరీరాన్ని తాకేలా..
ఈ పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం వాదోపవాదాలను ఆలకించింది. మహారాష్ట్ర ప్రభుత్వం, జాతీయ మహిళా కమిషన్ తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదనలను వినిపించారు. ఎవరైనా తన రెండు చేతులకు సర్జికల్ గ్లోవ్స్ ధరించి.. మహిళ శరీరాన్ని అంగాంగం తడిమినా గానీ అతనికి బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. శిక్ష పడదని అన్నారు. ఇది సరైనది కాదని వాదించారు.

బాంబే హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం..
వాదోపవాదాలను ఆలకించిన తరువాత సుప్రీంకోర్టు కొద్దిసేపటి కిందటే తన నిర్ణయాన్ని వెల్లడించింది. బోంబే హైకోర్టు నాగ్‌పూర్ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. పిటీషన్లతో ఏకీభవించింది. దుస్తులు ఉండగా శరీరాన్ని తాకడాన్ని కూడా లైంగిక నేరంగా పరిగణించవచ్చని స్పష్టం చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలంటే... స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ తప్పనిసరిగా కావాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. నిందితుడు నేరానికి పాల్పడాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి పాల్పడటానికి అవకాశం ఉందని, నేరపూరితమైన ఆలోచనలను అడ్డుకోవాల్సిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications