మమతా మేనల్లుడికి జడ్ ప్లస్ భద్రత... గవర్నర్‌కే లేదంటూ మండిపడ్డ బీజేపీ

కోల్‌కత్తా: మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి జడ్ ప్లస్ భద్రత కల్పిస్తూ ఆ రాష్ట్ర పోలీసులు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం తృణమూల్ యూత్ కాంగ్రెస్ మీటింగ్‌లో దేబాషిష్ ఆచార్య అనే విద్యార్ధి అభిషేక్ బెనర్జీ చెంపపై కొట్టిన విషయం తెలిసిందే.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

దీంతో పశ్చిమ బెంగాల్ హోం మంత్రి (సీఎం మమతా బెనర్జీ దగ్గరే హోం శాఖ ఉంది) ఆదేశాల మేరకు డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని పోలీసులు అధికారులు వెల్లడించారు. ఇప్పుడు ఈ జడ్ ప్లస్ భద్రత కల్పిస్తుండడంపై బీజేపీ మండిపడింది.

Slap effect: Mamata Banerjee’s nephew may get security upgrade to Z plus

అభిషేక్ బెనర్జీని సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రాతో పోల్చుతూ పలు విమర్శలు చేసింది. బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ అభిషేక్ బెనర్జీ ఇప్పుడు రాబర్డ్ వాద్రాలా తయారవుతున్నారని అన్నారు. సోనియా అల్లుడిగా వాద్రా ఢిల్లీలోనూ, దేశ వ్యాప్తంగానూ ఎంతో దర్జా వెలగబెట్టారు. ఇప్పుడు అదే తరహాలో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పశ్చిమ బెంగాల్లో సూపర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్‍‌గా వెలుగొందుతున్నట్లు కనిపిస్తుందని చెప్పారు.

అభిషేక్ బెనర్జీకి కల్పిస్తున్న జడ్ ప్లస్ భద్రత పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీ నాథ్ త్రిపాఠికి కూడా లేదని అన్నారు. గవర్నర్ అంటే రాష్ట్ర ప్రథమ పౌరుడని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ పైన దాడి చేసిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అతనికి పలుచోట్ల గాయాలయ్యాయి.

ఆయన కండిషన్ విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. దేబాషిష్ ఆచార్య పైన హత్యాయత్నం కేసు పెట్టారు. అభిషేక్‌ను కొట్టిన వ్యక్తి పేరు దేబాషిష్ ఆచార్య. అతనిని పోలీసులు అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో హత్యాయత్నం సెక్షన్ కూడా ఉంది. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి బాగుంటే న్యాయస్థానం ఎదుట హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు.

కాగా, అభిషేక్ బెనర్జీ పైన దాడి చేసిన వ్యక్తి 25 ఏళ్ల బీటెక్ విద్యార్థి. దుర్గాపుర్‌లోని ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్నాడు. అతని పైన దాడి చేసిన సమయంలో ఆ విద్యార్థి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. 'నేను ఖుదీరామ్స్ ఆత్మను. నేను మళ్లీ జన్మిస్తాను. గుడ్ బై, ఇండియన్స్' అని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+