స్వల్ప ఊరట: టోల్ రేట్ల పెంపు అమలు లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచే
న్యూఢిల్లీ: వాహనదారులకు కొంత ఊరట కలిగించే వార్త ఇది. టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని భారత ఎన్నికల సంఘం(ECI) జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI)ని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల పూర్తయ్యే వరకు పెంపును నిలుపుదల చేయాలని సూచించింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో పాత ఛార్జీలనే వసూలు చేయాలని టోల్ ఆపరేటర్లకు ఎన్‌హెచ్ఏఐ స్పష్టం చేసింది. కాగా, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న టోల్ రుసుం పెరుగుతుంది. ఈ పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుంది. దీంతో పెరిగిన ఛార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, ఎన్నికల నేపథ్యంలో ఈ పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం సూచించింది.

ఈ నేపథ్యంలో నేటి నుంచి పాత టోల్ రేట్లను వసూలు చేయనున్నారు. అంతేగాక, ఆదివారం అర్ధరాత్రి నుంచి వసూలు చేసిన అధిక మొత్తాలను వాహనదారులకు వెనక్కి ఇవ్వనున్నట్లు ఎన్‌హెచ్ఏఐ వర్గాలు వెల్లడించాయి.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 26 నుంచి జూన్ 1 వరకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికలు పూర్తయ్యాక రాష్ట్రాల్లో పెంపు అమల్లోకి వస్తుందా? లేక సార్వత్రిక ఎన్నికల సమరం మొత్తం పూర్తయ్యే వరకూ పాత ఛార్జీలే కొనసాగుతాయా? అనేది తేలాల్సి ఉంది. అయితే, ఏ రాష్ట్రంలో అయితే ఎన్నికలు పూర్తయితే ఆ రాష్ట్రంలో టోల్ రేట్లు పెంపు ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.












Click it and Unblock the Notifications