సినిమా ఛాన్సుల్లేక ముంబై మోడల్ మోనా ఆత్మహత్య
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ మోడల్ ఆత్మహత్య చేసుకుంది. ముంబైలోని వెరోవా రెసిడెన్సీలో ఆమె సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకున్న మోడల్ పేరు మోనా ఖన్నాగా తెలుస్తోంది. ఆమె ఓ సూసైడ్ నోట్ కూడా రాసింది.
ఈ మోడల్ బలవన్మరణానికి పాల్పడడానికి అవకాశాలు రాకపోవడమేనని సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. మోనా కొద్దికాలంగా మోడలింగ్ రంగంలో కొనసాగుతోంది. ఆమెకు నటన అంటే ఎంతో ఇష్టం. సినిమాల్లో నటించాలనుకుంది.

కానీ, సినిమా అవకాశాలు రాకపోవడంతో మోనా తీవ్ర మనస్తాపం చెందింది. మోడలింగ్ కూడా అడపాదడపా చేస్తోంది. దీంతో, తనువు చాలించాలని నిర్ణయించుకుంది. తన చావుకు ఎవరూ కారణం కాదని, సినిమా చాన్సులు దక్కని కారణంగానే ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
కాగా, మోనా తల్లిదండ్రులు కొన్నేళ్ళ క్రితం మరణించారు. ప్రస్తుతం ఆమె తన టీనేజ్ సోదరితో కలిసి ఉంటోంది. మోడల్ మరణంపై కేసు నమోదు చేసుకున్న వెరోరా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఆమె సోదరి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.












Click it and Unblock the Notifications