స్మార్ట్‌ సిటీ అవార్డ్స్‌ 2020 విడుదల - టాప్‌లో ఇండోర్‌-సూరత్-తిరుపతికి అవార్డుల పంట

దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా వివిధ రంగాల్లో సమగ్రాభివృద్ధితో పాటు మెరుగైన ప్రతిభ చూపుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, నగరాలకు కేంద్రం స్మార్ట్ సిటీస్ అవార్డులు ప్రకటిస్తుంది. ఇలా గతేడాది ఆయా రంగాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీస్‌ అవార్డుల్లో ఉత్తమ రాష్ట్రంగా యూపీ, కేంద్రపాలిత ప్రాంతంగా ఛండీఘడ్‌, నగరాలుగా ఇండోర్‌-సూరత్ నిలిచాయి. పలు విభాగాల్లో ఆయా రాష్ట్రాలు సాధించిన అవార్డుల జాబితా ఓసారి పరిశీలిస్తే...

స్మార్ట్‌ సిటీస్ అవార్డ్స్‌ 2020

స్మార్ట్‌ సిటీస్ అవార్డ్స్‌ 2020

ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్మార్ట్ సిటీస్ అవార్డ్స్‌ను గతేడాదికి తాజాగా ప్రకటించారు. ఇందులో సామాజిక అంశాలు, పరిపాలన, సంస్కృతి, పట్టణాభివృద్ధి, పారిశుద్ద్యం, ఆర్ధిక వ్యవస్ధ, నిర్మాణ వాతావరణం, తాగునీరు, అర్బన్ మొబిలిటీ వంటి అంశాల ప్రాతిపదికన ఈ అవార్డులు ప్రకటిస్తుంటారు. గతేడాది ఆయా రంగాల్లో టాప్‌లో నిలిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, నగరాలకు కేంద్రం తాజాగా ఈ అవార్డులు ప్రకటించింది. ఇందులో దేశవ్యాప్తంగా పలు నగరాలు సత్తా చాటుకున్నాయి.

 టాప్‌ స్మార్ట్‌ సిటీస్‌గా ఇండోర్‌-సూరత్‌

టాప్‌ స్మార్ట్‌ సిటీస్‌గా ఇండోర్‌-సూరత్‌

కేంద్రం తాజాగా గతేడాదికి ప్రకటించిన స్మార్ట్‌ సిటీస్‌ అవార్డుల్లో ఉత్తమరాష్ట్రంగా ఉత్తర్‌ప్రదేశ్‌ నిలిచింది. ఆ తర్వాత స్ధానాల్లో మధ్యప్రదేశ్, తమిళనాడు నిలిచాయి. కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో చండీఘడ్‌ టాప్‌లో నిలిచింది. అలాగే స్మార్ట్ సిటీస్ జాబితా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, గుజరాత్‌లోని సూరత్‌ సంయుక్తంగా టాప్‌ ప్లేస్‌ దక్కించుకున్నాయి. గతంలో ప్రకటించి అవార్డుల్లోనూ ఈ నగరాలు సత్తా చాటుకున్నవే కావడం విశేషం.

 తిరుపతికి అవార్డుల పంట

తిరుపతికి అవార్డుల పంట

గతేడాది స్మార్ట్‌ సిటీస్‌ అవార్డుల్లో ఏపీకి చెందిన మూడు నగరాలు పలు అంశాల్లో మెరుగైన స్ధానంలో నిలిచాయి. ఇందులో క్లైమేట్‌ స్మార్ట్‌ సిటీల్లో 4 స్టార్ రేటింగ్ కేటగిరిలో విజయవాడ, విశాఖ వరుసగా ఐదు, ఏడు స్ధానాలు దక్కించుకున్నాయి. అలాగే సామాజిక అంశాల్లో తిరుపతి మేరుగైన స్ధానంలో నిలిచింది. తిరుపతి పురపాలక పాఠశాలల్లో ఆరోగ్యం విషయంలో టాప్‌లో నిలిచింది. అలాగే పట్టణాభివృద్ధి అంశంలోనూ పునరుత్పాదక శక్తి ఉత్పత్తి విషయంలో తిరుపతి టాప్‌ త్రీలో నిలిచింది. పారిశుద్ధ్యం, ఆర్ధిక అంశాల్లోనూ తిరుపతి టాప్‌ త్రీలో నిలిచింది. అంతకు ముందు ఏడాది కూడా ఏపీకి చెందిన ఈ మూడు నగరాలు వివిధ అంశాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాయి.

వివిధ నగరాలకు దక్కిన అవార్డులివే

వివిధ నగరాలకు దక్కిన అవార్డులివే

సామాజిక అంశాల్లో తిరుపతి, భువనేశ్వర్‌, తుముకూరు, పరిపాలనలో వడోదర, థానే, భువనేశ్వర్, సంస్కతిలో ఇండోర్‌, చండీఘడ్‌, గ్వాలియర్, పట్టణాభివృద్ధిలో భోపాల్‌, చెన్నై, తిరుపతి టాప్‌లో ఉన్నాయి. పారిశుద్ధ్యం విషయంలో తిరుపతి, ఇండోర్‌, సూరత్, ఆర్ధిక అంశాల్లో ఇండోర్‌, తిరుపతి, ఆగ్రా, పర్యావరణ అంశాల్లో ఇండోర్‌, సూరత్, తాగునీటి అంశంలో డెహ్రూడూన్, వారణాసి, సూరత్, అర్బన్ మొబిలిటీలో ఔరంగాబాద్‌, సూరత్, అహ్మదాబాద్, సృజనాత్మక నగరాల్లో ఇండోర్‌ టాప్‌లో నిలిచాయి. కోవిడ్‌ ఇన్నోవేషన్ అవార్డును కళ్యాణ్‌-డోంబివ్యాలీ, వారణాసి సంయుక్తంగా దక్కించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+