రెచ్చిపోయిన స్మృతి ఇరానీ - ప్రియాంక చతుర్వేది
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత ప్రియాంక చతుర్వేది మధ్య సోమవారం నాడు ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. తనపై నిర్భయ తరహాలో అత్యాచారం చేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చినట్లు తాజాగా రాసిన వ్యాసంలో ప్రియాంక పేర్కొన్నారు.
ఆమె రాసిన వ్యాసం ట్విట్టర్లో ట్రెండ్ అయింది. ఈ నేపథ్యంలో ప్రియాంక పైన దాడి చేస్తే అది మహిళల గౌరవంపై దాడి, అదే స్మృతి ఇరానీపై దాడి చేస్తే ఆమోదయోగ్యమా? చెప్పాలని షెఫాలి వైద్య ట్విట్టర్లో ప్రశ్నించారు. ప్రియాంక, స్మృతి మధ్య మాటల యుద్ధం జరిగింది.
రాహుల్ గాంధీని విమర్శిస్తూ ట్విట్టర్ వేదికగా స్మృతీ ఇరానీ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు, ఆపై వాటిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంకా చేసిన ట్వీట్లు, వ్యక్తిగత విమర్శలకు దారితీయగా ఇవి పెను దుమారం రేపాయి.
తనపై నిర్భయ తరహాలో అత్యాచారం చేస్తామని బెదిరింపులు వచ్చినట్టు ప్రియాంక ఓ వ్యాసంలో రాసిన విషయమై చర్చ మొదలైంది. ప్రియాంక వ్యాసంపై మండిపడ్డ షెఫాలీ వైద్య... ప్రియాంకపై దాడి జరిగితే, అది మహిళలపై దాడి కింద, స్మృతీ ఇరానీపై దాడి చేస్తే ఆమోదయోగ్యమా? అంటూ ప్రశ్నించారు.

దీనిపై ప్రియాంక స్పందిస్తూ... జడ్ కేటగిరీ భద్రతలో ఉన్న ఆమెపై ఎలా అత్యాచారం జరుగుతుందని, తనకు ఎలాంటి సెక్యూరిటీ లేదన్నారు. ఈ ట్వీట్ల మధ్యకు తన ప్రస్తావన రావడంతో స్మృతీ ఇరానీ వచ్చి.. తనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లేదని స్పష్టం చేశారు.
అసలు సెక్యూరిటీ లేకుండా ఉండదు కదా అని ప్రియాంక వ్యాఖ్యానించారు. దీనిపై మళ్లీ స్పందిస్తూ.. తన భద్రత గురించి అంత ఆలోచన ఎందుకని, ఏదైనా ప్లాన్ చేయిస్తున్నావా? అని ప్రశ్నించారు. దానికి ప్రియాంక.. తనకు అంత తీరిక లేదని, మీరు మాత్రం యూనివర్శిటీ క్యాంపస్‌లను రచ్చ చేసే పనిలోనే ఉండాలన్నారు.
దీనికి కూడా స్మృతీ బదులిస్తూ... రాహుల్ పై విమర్శలకు దిగారు. అసోంలో ఓటమి ఆయన ఘనతేనని స్మృతీ ట్వీట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన మీరు, కేబినెట్ హోదాను పొందారని ప్రియాంక ట్వీట్ చేశారు. వీరి మధ్య సాగిన ట్వీట్లను నెటిజన్లు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications