కుంభమేళాకు దేశవిదేశాల ప్రతినిధులు... పుణ్యస్నానమాచరించిన స్మృతి ఇరానీ
అర్ధకుంభమేళా మహాక్రతువుకు ప్రముఖులు క్యూ కడుతున్నారు. మకర సంక్రాంతి నాడు మొదలయ్యే ఈ కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు వస్తుంటారు. గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ భక్తి ప్రపత్తులు చాటుతుంటారు. ఆ క్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుంభమేళా ప్రారంభమైన తొలిరోజే (మంగళవారం) ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. గంగా నదిలో పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేసింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. జనవరి 15 నుంచి మార్చి 4 వరకు జరిగే ఈ కుంభమేళా కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశవిదేశాల నుంచి తరలివచ్చే ప్రముఖుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. వీఐపీలు, వీవీఐపీలు, ఎన్నారైల కోసం వేర్వేరుగా ఏర్పాట్లు చేసినట్లు ఇప్పటికే ప్రకటించింది. అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన తర్వాత జరుగుతున్న తొలి అర్ధ కుంభమేళా కావడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు చేసింది. అంతేకాదు ఈ కుంభమేళాను అపురూపమైన సాంస్కృతిక వారసత్వ ప్రతీకగా యునెస్కో గుర్తించడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

కుంభమేళాకు 71 దేశాల ప్రతినిధులు హాజరవుతారని అంచనా. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అంతేకాదు వీరి రాక కోసం ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేసింది. ఈ మార్గంలోకి ఇతర వాహనాలు రాకుండా నిషేధాజ్ఞలు కూడా విధించింది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications