లెక్క సరిపోలేదు పుష్పా, ఒక్కటి తక్కువైయ్యింది, ఇప్పుడు సరిగా సరిపోయింది గురూ, మామలు !
బెంగళూరు: పుష్పా సినిమా పేరు చెబితో తెలీదు అని చెప్పే సినిమా ప్రేమికులు ఎవ్వరూ ఉండరు. తెలుగు, తమిళ, మళయాలం, హిందీ బాషల్లు పుష్పా సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. పుష్పా సినిమాలో గంధపు చెక్కల స్మగ్లింగ్ సరికొత్త కోణంలో చూపించారు. అయితే అచ్చం పుష్పా సినిమా టైపులో గంధపు చెక్కలకు బదులుగా గోవా నుంచి కాస్లీ మద్యం తరలిస్తున్నారు.
పుష్ప సినిమా తరహాలో గోవా నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనంపై ఎక్సైజ్ అధికారులు దాడి చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 25 లక్షల విలువైన గోవా మద్యం స్వాధీనం చేసుకున్నారు. విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల ప్లాన్ తెలుసుకుని షాక్ అయ్యారు.బీహార్‌లోని బంగా బజార్‌కు చెందిన సుభోదా రామ్‌నాథ్ మహతో అనే వ్యక్తి పోలీసులకు చిక్కాడు.

క్యాంటర్‌లో వాహనంలో అక్రమంగా గోవా మద్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం సేకరించిన ఎక్సైజ్ అధికారులు తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని ఖానాపుర తాలూకా కనకుంబి చెక్‌పోస్టు వద్ద వాహనాన్ని ఆపారు. తరువాత క్యాంటర్ వాహనం పరిశీలించిన ఎక్సైజ్ శాఖ పోలీసులకు ఎలాంటి క్లూ చిక్కలేదు. అదే సమయంలో పోలీసులకు పుష్పా సినిమా గుర్తుకు వచ్చింది.

సీక్రేట్ కంటేనర్ లో ఎవరికీ కనిపించకుండా అక్రమంగా మద్యం రవాణా చేసేందుకు పక్కాప్లాన్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎక్సైజ్ శాఖ అధికారులు 90 కార్డ్‌బోర్డ్ బాక్సుల్లో దాచిపెట్టిన బ్లెండర్ స్పిరిట్ విస్కీ బాటిళ్లు, ప్లాస్టిక్ డబ్బాల్లోని 80లీటర్ల బ్లెండ్ విస్కీ, బ్యాగ్‌లో రాయల్ స్పాగ్ విస్కీ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో ఫ్లైవుడ్ పలకల మధ్య లారీలో తరలిస్తున్న 25 లక్షల రూపాయలకు పైగా విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications